Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

నాగచైతన్య, సమంత విడాకులపై నాగార్జున స్పందించినట్టు గురువారం ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. దానిపై నాగార్జున వివరణ ఇచ్చారు. 

FOLLOW US: 

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై నాగార్జున స్పందించారా? అంటే... 'స్పందించారు' అంటూ గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే ప్రచారం జరుగుతోంది. అలాగే, నేషనల్ మీడియాలో కూడా! గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల తర్వాత చైతూ - సమంత మధ్య గొడవలు వచ్చాయని, సమంతే ముందుగా విడాకులు కోరిందని నాగార్జున పేర్కొన్నట్టు ప్రచారం జరిగింది. దానిపై ఆయన స్పందించారు. తాను అలా అనలేదని ట్వీట్ చేశారు.

"నాగ చైతన్య - సమంత గురించి నేను ఓ స్టేట్మెంట్ ఇచ్చినట్టు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అసంబద్ధం కూడా! దయచేసి పుకార్లను వార్తలుగా ప్రసారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాను" అని నాగార్జున ట్వీట్ చేశారు. దీంతో కొన్ని రోజులుగా మీడియాలో నాగార్జున స్పందించినట్టు వార్తలు అన్నీ అవాస్తవాలేనని తేలింది. 

విడాకుల తర్వాత సమంత మీద ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. ఓ దశలో విమర్శలు పెరగడంతో సమంత స్పందించక తప్పలేదు. ఆమెకు ఎవరితోనో సంబంధం ఉందని, డబ్బు కోసం విడాకులు తీసుకున్నారని, పిల్లల్ని కనడం ఇష్టం లేదని వచ్చిన పుకార్లను ఖండించారు. విడాకుల తర్వాత ఒక సందర్భంలో చచ్చిపోవాలని అనిపించినట్టు కూడా చెప్పుకొచ్చారు. తర్వాత తాను స్ట్రాంగ్ అయ్యానని ఆమె అన్నారు.

ఇక, నాగచైతన్య విషయానికి వస్తే... 'బంగార్రాజు' విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరి సంతోషం కోసమే విడాకులు తీసుకున్నట్టు తెలిపారు. అంతకు మించి విడాకుల గురించి నాగచైతన్య స్పందించలేదు. ఎక్కువ సందర్భాల్లో అతను మౌనం వహిస్తున్నారు. తనపై విమర్శలు వస్తున్నాయి కనుక సమంత స్పందించక తప్పడం లేదు. అయితే... విడాకుల తర్వాత ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఇద్దరూ కలిసి నటించే అవకాశాలు లేకపోవచ్చు. కానీ, సమంతతో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నట్టు ఇటీవల నాగచైతన్య చెప్పడం విశేషం.

Published at : 27 Jan 2022 06:14 PM (IST) Tags: samantha Naga Chaitanya nagarjuna Samantha Naga Chaitanya Divorce Nagarjuna Condemns Rumours Chay - Sam Divorce

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

టాప్ స్టోరీస్

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ