అన్వేషించండి
Advertisement
Nagarjuna - The Ghost: నాగార్జున... సోనాల్ చౌహన్... దుబాయ్‌లో డిష్యూం... డిష్యూం!
అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ దుబాయ్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అక్కడ వాళ్ళిద్దరిపై యాక్షన్ సీన్లు తీయడానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేశారు.
కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ది ఘోస్ట్' (The Ghost). ఇందులో సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను నారాయణ్ కె దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి దుబాయ్ (The Ghost Dubai Schedule)లో పదిహేను రోజులు షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారు.
థాయ్‌లాండ్‌కు చెందిన స్టంట్ డైరెక్టర్ సీలుమ్ (Seelum Pradit alias Nung) నేతృత్వంలో దుబాయ్‌లో మూడు భారీ యాక్షన్ సీన్స్‌ను తీయడానికి ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 3 నుంచి మొదలయ్యే షెడ్యూల్‌లో నాగార్జున, సోనాల్ చౌహన్ (Sonal Chauhan) మీద ఫైట్స్ తీయనున్నారని తెలిసింది.
దుబాయ్ అంటే చాలా మంది సాంగ్స్ తీయడానికి వెళతారు. కానీ, ప్రవీణ్ సత్తారు ఫైట్స్ తీయడానికి వెళుతున్నారు. 'ది ఘోస్ట్' కంటే ముందు దుబాయ్‌లో భారీ యాక్షన్ సీన్స్ తీసిన సినిమా 'సాహో' ఒక్కటేనేమో! 'ది ఘోస్ట్'లో నాగార్జున మాజీ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రా ఏజెంట్ నేపథ్యంలో కూడా కొన్ని సీన్స్ ఉంటాయట. రా అంటే యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా! ఆల్రెడీ 'పీఎస్వీ గరుడవేగ' సినిమాలో స్టయిలిష్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన అనుభవం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru)కు ఉంది. ఈ సినిమాలో కూడా కొత్త తరహా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారట.
గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారు. రా ఏజెంట్ గా ఉన్నప్పుడు ఒక లుక్, ఆ తర్వాత మరో లుక్ ఉంటుందట. 'బంగార్రాజు' తర్వాత నాగార్జున నటిస్తున్న సినిమా ఇది. ఈ ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion