Daaku Maharaaj First Review: థియేటర్లలో బాలయ్య శివ తాండవమే - 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Daaku Maharaaj Movie Review: మ్యాన్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ మామూలుగా ఉండదు. ఆయన కొత్త సినిమా 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ గూస్ బంప్ తెప్పించాలా ఉంది.
సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా వస్తే సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఒకటి ఉంది. తెలుగు ప్రజల పెద్ద పండక్కి వచ్చిన ఆయన సినిమాల్లో చాలా వరకు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయని చెప్పాలి. సంక్రాంతి 2025 కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నిర్మాత నాగ వంశీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
'డాకు మహారాజ్'... థియేటర్లలో శివ తాండవమే!
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అయితే... విడుదలకు పది రోజుల ముందు సంగీత దర్శకుడు తమన్ తన వర్క్ పూర్తి చేసి దర్శక నిర్మాతలకు సినిమా చూపించారు.
Daaku Maharaaj First Review: ''ఇప్పుడే డాకు మహారాజ్ స్కోర్ చూశాను. ఒక్కటే ఒక్క మాట... సూపర్ (థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనే విధంగా ఫైర్ బ్లాస్ట్ ఎమోజిలు పోస్ట్ చేశారు). జనవరి 12వ తేదీ వరకు వెయిట్ చేయండి. ఎవరు ఊహించని విధంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా బ్రదర్ తమన్ బ్లాక్ బస్టర్ స్కోర్ డెలివర్ చేశాడు. థియేటర్లలో శివతాండవమే అమ్మా'' అని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ ట్వీట్ చేశారు.
Just watched #DaakuMaharaaj score… only one word - INSANEEEEEEEEE 🔥🔥🔥💥💥💥
— Naga Vamsi (@vamsi84) December 30, 2024
Just wait till Jan 12th... 🔥
Brother @MusicThaman has delivered a once in a lifetime experience that one could ever imagine! 💥💥💥💥💥….Theatres lo Shiva Thandavame ammaaaaaaaa 🥁🥁🥁
'డాకు మహారాజ్'ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
'డాకు మహారాజ్' సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) మరోసారి కథానాయికగా నటించారు. బ్లాక్ బస్టర్ సాధించిన 'అఖండ' తర్వాత మరోసారి వాళ్ళిద్దరూ జోడీ రిపీట్ అయింది. ప్రగ్యా జైస్వాల్ కాకుండా సినిమాలో మరొక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వాళ్ళిద్దరి క్యారెక్టర్లు సినిమాకు హైలైట్ అవుతాయని తెలుస్తోంది. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా ప్రత్యేక గీతంలో సందడి చేశారు. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ రోల్ చేసిన ఈ సినిమాలో చాందిని చౌదరి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. బీజేపీ ఎంపీ - నటుడు రవికిషన్, రోనిత్ రాయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Also Read: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవడమా? శవాల మీద పేలాలు ఏరుకోవడమా?