Naga Chaitanya - Sobhita Dhulipala: ప్రేమ ఎక్కడ పుట్టింది? పెళ్లి ప్రపోజల్ ఎక్కడ? ఫస్ట్ టైమ్ ఓపెన్‌గా చెప్పిన శోభిత - నాగ చైతన్య
తాజా ఇంటర్వ్యూలో చై-శోభిత జంట ఫస్ట్ టైమ్ ఎక్కడ కలిశారు? ఎలా ప్రపోజ్ చేసారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహం రీసెంట్ గా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది? ఎలా మొదలైంది? నాగ చైతన్యకు శోభితలో నచ్చిన విషయం ఏంటి ? అనే ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉండిపోయాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నూతన వధూవరులు నాగచైతన్య, శోభిత ధూళిపాళ తమ రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను మొట్టమొదటిసారి వెల్లడించారు.
లవ్ స్టోరీ అలా మొదలైంది...
శోభిత 2018లో మొట్టమొదటిసారి నాగార్జున ఇంటికి వెళ్లినట్టుగా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే చైతూతో స్నేహం మాత్రం 2022 ఏప్రిల్ తర్వాత మొదలైందని ఆమె వెల్లడించారు. శోభిత మాట్లాడుతూ "నాకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ముందు ఫుడ్ గురించి మా ఒపీనియన్స్ చర్చించుకునేవాళ్లం. అయితే చైతన్య ఎప్పుడూ నన్ను తెలుగులో మాట్లాడమని అడిగే వారు. అలా తెలుగులో మాట్లాడటం వల్ల మా బంధం మరింత స్ట్రాంగ్ అయింది. నేను ఇన్స్టాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాను. అయితే నేను పెట్టే గ్లామర్ ఫోటోలు కాకుండా ఇన్స్పిరేషనల్ స్టోరీస్, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్ లకు నాగ చైతన్య లైక్ చేసేవారు" అంటూ గుర్తు చేసుకుంది శోభిత. అంతేకాకుండా 2022 ఏప్రిల్ నుంచి నాగ చైతన్యను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్టు శోభిత ఈ సందర్భంగా వెల్లడించింది.
మొట్టమొదటి డేట్ ఎక్కడంటే ?
ఇక నెమ్మదిగా వీళ్ళ స్నేహం కాస్తా ప్రేమ వైపు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ టైం నాగ చైతన్యను శోభిత ముంబైలోని కేఫ్ లో కలిసిందట. శోభిత మాట్లాడుతూ "అప్పట్లో నేను ముంబైలో, చైతన్య హైదరాబాద్లో ఉండేవాళ్లం. అయితే నాకోసమే నాగ చైతన్య హైదరాబాద్ నుంచి ముంబైకి వస్తూ ఉండేవారు. ఫస్ట్ టైం మేము కలిసి బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్ వేసుకోగా, నాగ చైతన్య బ్లూ సూట్ ను ధరించాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్ కు వెళ్లి అక్కడ కాస్త టైం స్పెండ్ చేశాము. ఒకరికొకరం గోరింటాకు కూడా పెట్టుకున్నాము. అనంతరం అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు వెళ్లాము. అక్కడి నుంచి జరిగిందంతా అందరికీ తెలుసు" అని చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు నాగ చైతన్య 'ధూత' సిరీస్ కోసం వెళ్లగా, 'మేడ్ ఇన్ హెవెన్' అనే వెబ్ సిరీస్ లో నటించిన శోభిత కూడా ఈవెంట్లో పాలు పంచుకుంది.
పెళ్లి ప్రపోజ్...
అయితే నాగచైతన్య ఫ్యామిలీ తనను న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానించినట్టు శోభిత గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది నాగ చైతన్య వెళ్లి శోభిత ఫ్యామిలీని కలిసారట. అనంతరం ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ చేశాడంటూ శోభిత వెల్లడించింది.
ఇక శోభితను తరచుగా తెలుగులో మాట్లాడమని ఎందుకు అడిగేవాడో నాగచైతన్య ఈ సందర్భంగా వివరించారు. "ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తూ ఉంటాము. కానీ తెలుగులో మాట్లాడే వారిని చూస్తే సంతోషంగా ఉంటుంది. త్వరగా కనెక్ట్ అవ్వగలను. అందుకే శోభితతో పరిచయం అయ్యాక నాతో తెలుగులోనే మాట్లాడమని అడిగేవాడిని" అని చైతన్య చెప్పుకొచ్చారు.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి