Nag Aswin Director : ‘మేక్ ఇన్ ఇండియా’ అనుకున్నా, కలగానే మిగిలిపోయింది - Kalki 2898 ADపై నాగ్ అశ్విన్ కామెంట్స్
సెన్సెషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి మేకింగ్ పై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నాగ్ అశ్విన్. అనతి కాలంలోనే అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్‌తో ‘మహానటి’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నాగ్ అశ్విన్. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఆయన పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ‘‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాపై కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు.
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదని చెప్పాడు. అయితే ఈ సినిమా సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఇండియాలోనే చేయాలనుకున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీని మేకిన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని కలలు కన్నానని, అయితే నా కలలు కల్లలుగానే మిగిలిపోయాయని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు.
సినిమా గ్రాఫ్‌తో పాటు కథలో ఉన్న ఎలివేషన్స్ ను తెరకెక్కించాలనే కారణంగానే ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కోసం హాలివుడ్ కంపెనీస్‌తో కలిసి పని చేయాల్సి వచ్చిందని నాగ్ అశ్విన్ తెలిపాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఇండియాలోనే చేశామన్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చాయని.. భవిష్యత్తులో యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో హాలీవుడ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం రాబోదన్నారు నాగ్ అశ్విన్. హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థలు ఇండియాలోనే ఉన్నాయని తెలిపాడు. అయితే అవి ఇంకా మెరుగుపడాలని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు.
పురాణాలకు గ్రాఫిక్స్ హంగులను జోడించి.. యాక్షన్ పార్టును జతచేసి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాను తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. ఇందులో కల్కి అనే సూపర్ హీరో పాత్రలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. యూనివర్సల్ హీరో కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్ బీ అమితాబచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ కల్కి మూవీని దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాల జాబితాలో ఈ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా ఒకటిగా నిలవనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయడానికి వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తుంది. అయితే వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్-కేతో ఈ సినిమాను మొదలుపెట్టారు. తర్వాత కథకు అనుగుణంగా ఈ సినిమా టైటిల్ ను ‘కల్కి 2898 ఏడీ’గా ఫిక్స్ చేసింది మూవీ టీం.
Also Read : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?