(Source: ECI/ABP News/ABP Majha)
Nag Ashwin: ‘కల్కి 2898 AD’ టైటిల్ అందుకే పెట్టాం - అసలు కథ చెప్పేసిన నాగ్ అశ్విన్
Kalki 2898 AD: ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తాజాగా అసలు సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో రివీల్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
Reason Behind Kalki 2898 AD Title: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తన అప్‌కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన సినిమాకు మార్కెట్ పెరిగింది కాబట్టి దానిని కాపాడుకునే బాధ్యత ప్రస్తుతం ప్రభాస్‌పైనే ఉంది. అందుకే తన అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ బయటికొస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ‘కల్కి 2898 ఏడీ’ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
అందుకే ఆ టైటిల్..
ఇప్పటికీ ‘కల్కి 2898 ఏడీ’ నుండి కేవలం ఒక గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇక అప్పుడప్పుడు కొన్ని పోస్టర్స్‌ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. వీటితో పాటు మూవీ షూటింగ్ నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుండి ఎన్ని పోస్టర్లు, ఫోటోలు బయటికి వచ్చినా కూడా అసలు దీని కథ ఏంటి అని ప్రేక్షకులు అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అసలు టైటిల్ వెనుక కథ ఏంటో రివీల్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘‘ఈ చిత్రం మహాభారతం కాలం నుండి మొదలయ్యి 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమయ్యి భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో మొత్తం 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం’’ అని బయటపెట్టాడు.
ఆ హాలీవుడ్ సినిమాతో పోలికలు..
‘‘కల్కి 2898 ఏడీ కోసం అప్పటి రోజులకు తగినట్టు ఒక ప్రపంచాన్ని సృష్టించాం. అన్నింటిలో ఇండియన్ టేస్ట్ కనిపించేలా జాగ్రత్త తీసుకున్నాం. దాదాపు ఇదే కథాంశంతో గతంలో బ్లేడ్ రన్నర్ అనే చిత్రం విడుదలయ్యింది. కానీ దాని పోలికలు ఏమీ ఈ చిత్రంలో కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాం. ఇది మాకు పెద్ద సవాలులాగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. ఇక ఫైనల్‌గా అసలు ‘కల్కి 2898 ఏడీ’ అంటే ఏంటి? అందులో ప్రభాస్ లుక్ ఎందుకలా ఉంది అనే విషయాలపై ప్రేక్షకులు ఒక క్లారిటీ వచ్చేసింది.
త్వరలోనే టీజర్..
మే 9న ‘కల్కి 2898 ఏడీ’ విడుదల అయ్యేలా మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనెతో పాటు దిశా పటానీ కూడా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ మొత్తంగా 22 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను తెలుగుతో పాటు మరెన్నో భాషల్లో కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక తాజాగా మొత్తంగా 22 భాషల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. త్వరలోనే ఈ మూవీ టీజర్ కూడా విడుదల అవ్వనుందని సమాచారం.
Also Read: కనీవినీ ఎరుగని రీతిలో 'కల్కి 2898 AD' రిలీజ్ - ఏకంగా అన్ని భాషల్లో?