అన్వేషించండి

Kalki2898AD : కనీవినీ ఎరుగని రీతిలో 'కల్కి 2898 AD' రిలీజ్ - ఏకంగా అన్ని భాషల్లో?

Kalki2898AD : ప్రభాస్ 'కల్కి 2898AD' సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 22 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది.

Kalki 2898 AD to release in 22 languages : తెలుగు సినిమా ఎల్లలు దాటుతోంది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు తెలుగు సినిమాని ఎంతగానో ఆదరిస్తున్నారు. 'బాహుబలి', 'RRR', 'పుష్ప, 'సలార్' లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా 'కల్కి2898AD' సినిమాని రూపొందిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హై టెక్నికల్ వ్యాలుస్ తో భారీ తారాగణంతో గ్రాండ్ స్కేల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ అంచనాలను మరింత పెంచగా.. తాజాగా మరో అప్డేట్ బయటికి వచ్చింది. దాని ప్రకారం 'కల్కి2898AD' సినిమాని కనీవిని ఎరుగని రీతిలో విడుదల చేయబోతున్నారట. ఇప్పటివరకు మరే ఇండియన్ సినిమా విడుదలకానన్ని భాషల్లో 'కల్కి' రిలీజ్ కాబోతోంది.

22 భాషల్లో 'కల్కి2898AD' విడుదల

డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'కల్కి2898AD' సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 22 భాషల్లో విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియా అంతటా ఈ వార్త ట్రెండ్ అవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక భాషల్లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ ఫిల్మ్ గా 'కల్కి2898AD' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి మూవీ టీం త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మార్చ్ మూడో వారంలో టీజర్

'కల్కి2898AD' నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా 'కల్కి' టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 'కల్కి' టీజర్ సుమారు 1 నిమిషం 23 సెకన్ల నిడివితో ఉండబోతుందట. ఈ టీజర్ ని హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి మూడో వారంలో టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే టీజర్ రిలీజ్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఉన్న హైప్ పీక్స్ కి చేరడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సీనియర్ నిర్మాత అశ్విని దత్ 'కల్కి2898AD' సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మరో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : అందుకే ‘యానిమల్’ మూవీ సక్సెస్‌‌ను ఎంజాయ్ చేయలేకపోయా: రష్మిక

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
Sunil : పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
Karikaala Movie: పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
Anupama Parameswaran : నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?
నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget