అన్వేషించండి

Mrunal Thakur : వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్

Mrunal Thakur Reaction : హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లికి టైం రావాలని అన్నారు.

Mrunal Thakur Comments About Her Marriage : 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి వార్తలు గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం సాగింది. కొందరు మరో అడుగు ముందుకు వేసి వారి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. మృణాల్ ఒక్క ఇంటర్వ్యూతోనే ఈ రూమర్లన్నింటికీ చెక్ పెట్టేశారు. 

పెళ్లిపై మృణాల్ క్లారిటీ

తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు మృణాల్. తాను పెళ్లి చేసుకుంటానని కానీ టైం రావాలని అన్నారు. 'నా లైఫ్‌లోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెడతాను. అప్పుడు నేనే స్వయంగా చెబుతాను. నా సోషల్ మీడియా అకౌంట్స్‌లో నేనే పోస్ట్ చేస్తాను. ఈ విషయాన్ని మీతో పంచుకునే ఫస్ట్ వ్యక్తిని నేనే.' అని స్పష్టం చేశారు.

Also Read : పిల్లి మాయకు నిజంగా శక్తులున్నాయా? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్ 'హనీ'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వాళ్లకు 'ఏప్రిల్ ఫూల్ డే'

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ధనుష్‌తో పెళ్లి అంటూ వస్తోన్న రూమర్స్‌పై స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు మృణాల్. 'నేను పెళ్లి చేసుకుంటున్నానా? లేదు. నాకైతే ఫిబ్రవరి 14న ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకొంటున్నట్లు అనిపించింది. అలా రూమర్స్ ప్రచారం చేసే వాళ్లకు నిజంగా అది ఏప్రిల్ ఫూల్ డే. ఇది ఎవరు ఎక్కడ ఎలా ప్రారంభించారో నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఏమీ చెప్పకపోయినా మృణాల్ చెప్పిందంటూ రాస్తున్నారు. వీటిని చూసి వావ్ ఇదేమిటి? అని అనుకున్నా.' అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. గతంలోనూ ఆమె టీం పెళ్లి రూమర్స్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగలేదు.

అందుకే బ్రేకప్..

ఇక లేటెస్ట్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి గురించి సైతం ఓపెన్ అయ్యారు మృణాల్. తాను యాక్టింగ్ చేయడం తన ప్రియుడికి నచ్చకపోవడం వల్లే బ్రేకప్ చెప్పాడని తెలిపింది. 'నేను యాక్ట్ చేయడం నచ్చక నాకు బ్రేకప్ చెప్పాడు. దూకుడు ఎక్కువ నాతో ఉండలేనన్నాడు. అతనితో బంధం ముగిసిపోయినందుకు నేనేం బాధ పడలేదు. చాలా ఇంపల్సివ్‌గా ఉంటావు.

హీరోయిన్‌వి అది కూడా నచ్చదంటూ బ్రేకప్ చెప్పాడు. అలాంటి వాళ్లతో కంటిన్యూ కావడం కష్టం. అతని మనస్తత్వం గురించి తెలిసి జాలిపడ్డాను. అందుకే విడిపోయాం.' అని చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే... మృణాల్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'దో దివానే శహర్ మే' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులోనూ యంగ్ హీరో అడివి శేష్‌తో 'డెకాయిట్' మూవీ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget