Dhanush : కోలీవుడ్ స్టార్ ధనుష్‌కు లీగల్ నోటీసులు - 20 కోట్లు చెల్లించాలంటూ...
Dhanush Legal Notice : కోలీవుడ్ స్టార్ ధనుష్‌కు ఓ నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. ఒప్పందం ప్రకారం తమ మూవీ స్టార్ట్ చేయలేదంటూ దీని వల్ల తమకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.

Dhanush Gets Legal Notice Of 20 Crores : కోలీవుడ్ స్టార్ ధనుష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. స్క్రిప్ట్ పూర్తి కాని కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోందంటూ తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ ఆయనకు లీగల్ నోటీసులు పంపింది. తమకు రూ.20 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొంది.
అసలేంటీ వివాదం?
2016లో ఈ నిర్మాణ సంస్థపై 'నాన్ రుద్రన్' సినిమా చేయడానికి ధనుష్ ఒప్పందం చేసుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని భావించారు. అయితే, డైరెక్టర్ మారడంతో ఆయన పూర్తిగా స్క్రిప్ట్ ఇవ్వలేదని సదరు నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. దీంతో షూటింగ్ ఆలస్యమై తమకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఇప్పటివరకూ ధనుష్ ఈ మూవీ స్టార్ట్ చేయలేదని... తమ ప్రాజెక్ట్ పక్కన పెట్టి వేరే సినిమాలు చేస్తున్నారంటూ లీగల్ నోటీసులు పంపింది. అయితే, ఈ వివాదంపై ఇప్పటివరకూ హీరో టీం రియాక్ట్ కాలేదు.
Also Read : సాగర సంగమం తీశానని చెప్పలేదే! - 'ఫంకీ' రివ్యూస్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్ రియాక్షన్
ప్రస్తుతం ధనుష్ 'D55' మూవీలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీకి 'అమరన్' ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తుండగా... ధనుష్ సరసన శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్, ఇతర వివరాలపై అప్డేట్స్ రానున్నాయి.























