News
News
X

Movie Release this Week: రాజ రాజ చోర, తరగతి గది దాటి, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరీస్ 9 సహా ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో తెలుసా....

ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త మూవీల సందడి ఉండడంతో ఈ వారం ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో అని ఎదురుచూసేవారు. కానీ కరోనా కారణంగా ఆ జాబితాలోకి ఓటీటీలు చేరాయ్. థియేటర్ ఆర్ ఓటీటీ..ఈ వారం రిలీజ్ లు ఏంటంటే...

FOLLOW US: 

క‌రోనా ప్రభావం సినీ ఇండ‌స్ట్రీపై తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో సినిమాలన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఏడాది ఆరంభంలో కరోనా ప్రభావం తగ్గడంతో థియేటర్లలో రిలీజవడం మొదలుపెట్టాయి. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బకి మళ్లీ  ఓటీటీనే ప్రత్యామ్నయంగా క‌నిపించింది. మళ్లీ ఇప్పుడిప్పడే  థియేటర్లు తెరుచుకోవడంతో ఒక్కో సినిమా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమైతే...కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ మార్గమే బెస్టనుకుంటున్నారు. ఇక ఈవారం ఓటీటీ, థియేటర్లలో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.

చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?

రాజ రాజ చోర

హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం 'రాజ రాజ చోర'. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకుంటూ తిరిగే ఓ దొంగ కథే ఈ మూవీ. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవిబాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఈ మూవీ ఆగస్టు 19న థియేటర్స్ సందడి చేయనుంది.

కుర్రాళ్ల గుండెలు పిండేసేలా హార్లీ డేవిడ్సన్ బైక్‌పై దివి హాట్ ఫొటోషూట్..

క్రేజీ అంకుల్స్‌

క్రేజీ అంకుల్స్‌' సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రధానపాత్రలో నటిస్తోంది. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ మూవీ ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది.

'కనబడుటలేదు'

సునీల్‌ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కనబడుటలేదు'. ఈ మూవీ కూడా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ప్రేమకథ కూడా జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. రామ్ గోపాల్ వర్మకు చెందిన స్పార్క్ ఓటీటీలో ఇది విడుదల కానుంది.

హీరో రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించారంటూ ట్రోల్స్? అసలు ఏం జరిగింది?

'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌'

హాలీవుడ్ మూవీస్‌ని ఫాలో అయ్యేవారికి ఈ వారం అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుంది ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' టీమ్. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన 8 మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక భారీ యాక్షన్ సీన్స్‌తో తొమ్మిదో సీరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 19న ఇంగ్లీష్‌, హిందీ తెలుగుతోపాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది.

'బజార్‌ రౌడీ'

'హృదయకాలేయం', 'కొబ్బరిమట్ట' సినిమాలతో హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేశ్‌ బాబు హీరోగా.. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బజార్‌ రౌడీ'. మహేశ్వరి వద్ది హీరోయిన్.

వెంకటేష్ సినీ జర్నీకి 35 ఏళ్లు.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్

ఓటీలో విడుదలయ్యే సినిమాలేంటంటే...

నెట్‌ఫ్లిక్స్‌ 

కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో (ఆగస్టు 20)

స్వీట్‌గర్ల్‌ (ఆగస్టు 21)

అమెజాన్‌ ప్రైమ్‌

ఇవాన్‌ అల్మైటీ (ఆగస్టు 16)

ద స్కెలిటన్‌ ట్విన్స్‌ (ఆగస్టు 17)

నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (ఆగస్టు 18)

అన్నెట్టే (ఆగస్టు 20)

కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ (ఆగస్టు 20)

హోమ్‌ (ఆగస్టు 19)

పాపులర్ సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' విజేతగా పవన్ దీప్ రాజన్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

జీ 5

200 హల్లా హో  (ఆగస్టు 20)

ఆల్ట్‌ బాలాజీ

కార్టెల్‌ (ఆగస్టు 20)ఆహా...

తరగతి గది దాటి  ( ఆగస్టు 20)

ఎవరు మీలో కోటీశ్వరులు.. రామ్ చరణ్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ, ప్రోమో అదుర్స్!

Published at : 16 Aug 2021 07:07 PM (IST) Tags: Movies This week Movie This week Released In Theaters OTT this week Raja raja Chora Taragathi gadhi dhati fast and furious 9

సంబంధిత కథనాలు

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Ram Charan: శంకర్ డబుల్ గేమ్ - చరణ్ ఎఫెక్ట్ అవుతున్నారా?

Ram Charan: శంకర్ డబుల్ గేమ్ - చరణ్ ఎఫెక్ట్ అవుతున్నారా?

Shaakuntalam: త్రీడీలో 'శాకుంతలం' సినిమా - వాయిదా వేయక తప్పదట!

Shaakuntalam: త్రీడీలో 'శాకుంతలం' సినిమా - వాయిదా వేయక తప్పదట!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

టాప్ స్టోరీస్

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !