Indian Idol 12 Finale Highlights: పాపులర్ సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' విజేతగా పవన్ దీప్ రాజన్.. ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేతగా పవన్ దీప్ రాజన్ నిలిచాడు. ఫైనల్ లో తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియతోపాటు అరుణిత కంజిలాల్, నిహల్, సేలీ కంబ్లే, మహ్మద్ దనిష్ ను వెనక్కు నెట్టి.. పవన్ టైటిల్ గెలుచుకున్నాడు.
LIVE
Background
దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించే కార్యక్రమం ‘ఇండియన్ ఐడల్’. 11 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మ్యూజికల్ షో ప్రస్తుతం 12వ సీజన్ ఫైనల్ కు వచ్చింది. టైటిల్ పోరులో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, నిహల్, సేలీ కంబ్లే, మహ్మద్ దనిష్ ఉన్నారు.
ఇండియన్ ఐడల్ విన్నర్ పవన్ దీప్ రాజన్
Jinki kismat mein likhi thi jeet, jinke taaron mein likha tha khitaab, unn #IdolPawandeep ko jeet ka salaam! CONGRATULATIONS #IdolPawandeep for the epic win, you have made history! India loves you!!! pic.twitter.com/tvJyps7tCf
— sonytv (@SonyTV) August 15, 2021
ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేతగా పవన్ దీప్
సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. 25 లక్షల ప్రైజ్ మనీతోపాటు ట్రోఫిని పవన్ కు అందించారు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్ దనిష్, ఐదో స్థానంలో నిహల్, మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. 12 గంటల పాటు సాగిన ఈ ఫైనల్ పోటీ ఉత్కంఠ రేపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్ షో అర్ధరాత్రి వరకు జరిగింది. మొదటినుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి.. ఫైనల్ బరిలో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, నిహల్, సేలీ కంబ్లే, మహ్మద్ దనిష్ నిలిచారు. ఈ ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారని అందరూ ఎంతో ఆసక్తితో చూశారు. చివరకు విజేతగా పవన్‌దీప్ నిలిచాడు.
ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన పవన్‌దీప్ రాజన్..
పవన్ దీప్ రాజన్ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా నిలిచాడు. మిగతా ఐదుగురు ఫైనలిస్టులను ఓడించి.. టైటిల్ గెలుచుకున్నాడు.
స్టేజ్ పైకి ఆరుగురు ఫైనలిస్టులు
షో ఫైనల్ కు చేరింది. ‘ఇండియన్ ఐడల్ 12’ లో ఆరుగురు ఫైనలిస్టులు వేదికపైకి వచ్చారు. ఆఖరి ఎపిసోడ్ కి ఉదిత్ నారాయణ్, అల్కా యజ్ఞిక్, సుఖ్వీందర్ సింగ్ అతిథులుగా వచ్చారు.
షణ్ముకకు విజయ దేవరకొండ సర్ ప్రైజ్
తెలుగు అమ్మాయి షణ్ముకకు హీరో విజయ్ దేవరకొండ వీడియో మెసెజ్ పంపాడు. అన్ని మరిచిపోయి.. షోను ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. పోటీలో ఉన్న వాళ్లకు, న్యాయ నిర్ణేతలకు శుభాకాంక్షలు తెలిపాడు. 'షణ్ముఖ ప్రియా మీరు తిరిగి హైదరాబాద్ వచ్చాక మనం కలుద్దాం. మీరు నా సినిమాలో పాడాలి. ఇదే మన డీల్ అని చెప్పాడు.