తమిళ స్టార్ విజయ్‌కు షాక్ ఇచ్చిన మలయాళీ డైరెక్టర్
తమిళ స్టార్ హీరో విజయ్‌కు ఒక మలయాళీ దర్శకుడు షాక్ ఇచ్చారు. ఆ దర్శకుడు ఎవరు? ఆయన ఇచ్చిన షాక్ ఏంటి? అంటే...
తమిళ స్టార్ హీరో విజయ్‌కు మలయాళీ దర్శకుడు అల్ఫోన్స్ (Alphonse Puthren) షాక్ ఇచ్చారు. అల్ఫోన్స్ అంటే కొంతమంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మలయాళ క్లాసిక్ సినిమా 'ప్రేమమ్'కు ఆయనే దర్శకుడు. దానిని తెలుగులో అదే పేరుతో అక్కినేని నాగ చైతన్య రీమేక్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే... తమిళ స్టార్ విజయ్‌కు అల్ఫోన్స్ షాక్ ఇచ్చారు. అదేంటంటే...
ఇలయ దళపతి విజయ్‌ను కలవాలని, ఒకసారి అపాయింట్‌మెంట్ ఇవ్వమని అల్ఫోన్స్ అడిగారు. కథ చెప్పాలని కోరారు. విజయ్ ఏమో తనకు కథ చెబుతాడని ఆశిస్తే... అల్ఫోన్స్ ఏమో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్‌కు కథ చెప్పారు. 'మీకు కాదండీ, ఈ కథ మీ అబ్బాయికి' అన్నారట. దాంతో షాక్ అవ్వడం విజయ్ వంతు అయ్యింది. 'బీస్ట్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పారు.
హీరోల కుమారులు హీరోలు కావడం సహజమే. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వారసులు ఉన్నారు. విజయ్ కుమారుడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే... విజయ్ మాత్రం తన కుమారుడు రెండు మూడేళ్లు సమయం కావాలని అడిగాడని, కుమారుడి మనసులో ఏముందో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అల్ఫోన్స్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, అందులో హీరోది బాయ్ నెక్స్ట్ డోర్ రోల్ అని, ఆ సినిమా జేసన్ సంజయ్ చేస్తే బావుంటుందని తన మనసులో మాటను విజయ్ బయట పెట్టారు. ప్రస్తుతం జేసన్ సంజయ్ విదేశాల్లో చదువుకుంటున్నారు.
జేసన్ సంజయ్‌తో సినిమా చేయడానికి కొంత మంది దర్శకులు, నిర్మాతలు తనను కలుస్తున్నారని విజయ్ తెలిపారు. జేసన్ హీరోగా రావాలని అనుకుంటే సపోర్ట్ చేస్తానని చెప్పారు. విజయ్ ఇంటర్వ్యూలో హైలైట్ ఏంటంటే... ఒకసారి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆయన సైకిల్ మీద వెళ్లిన సంగతి తెలిసిందే. "ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేశా. 'సైకిల్‌కి ఏం కాలేదు కదా నాన్నా!' అని అడిగాడు. 'నేను సేఫ్‌గా వచ్చానా? లేదా? అనేది మానేసి సైకిల్ గురించి అడుగుతున్నావా? ఫోన్ పెట్టేయ్ రా' అన్నాను. ఆ రోజు పోలింగ్ బూత్ ఇంటికి దగ్గరగా ఉండటంతో సైకిల్ మీద వెళ్లాను తప్ప... అందులో మరో ఉద్దేశం లేదు'' అని విజయ్ స్పష్టం చేశారు.
Also Read: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం
విజయ్ కథానాయకుడిగా నటించిన 'బీస్ట్' సినిమా బుధవారం (ఏప్రిల్ 13న) తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. 'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. అనిరుద్ సంగీతం అందించిన 'అరబిక్ కుతు', 'జింఖానా' పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
Also Read: ఏప్రిల్ రెండో వారంలో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు