Mokshagnya Teja New Look: స్టైలిష్, ఛరిష్మాటిక్, హ్యాండ్సమ్ మోక్షజ్ఞ... బాలయ్య తనయుడి న్యూ లుక్ అదుర్స్ కదూ
Prasanth Varma Mokshagna Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సిద్ధం అవుతున్నారు. తాజాగా ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసిన ఆయన లుక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో లుక్ అదిరిపోయింది.
నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు తనయుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించారు బాలయ్య. అయితే ఈ మూవీ ఇంకా తెరపైకి రావడానికి టైం పడుతుంది. అంతలోపు ఈ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు బయటకు వస్తున్న అప్డేట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. తాజాగా సరికొత్త లుక్ లో మోక్షజ్ఞ ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నందమూరి తారక రామారావు మనవడిగా, నటసింహం నందమూరి బాలయ్య కొడుకుగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. 'హనుమాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ సినీమాటికీ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న సినిమా ('సింబా ఈజ్ కమింగ్' అంటూ పేర్కొంటున్నారు) మూవీ కావడం విశేషం. ఇప్పటికే మోక్షజ్ఞ నటనలో మెళకువలు నేర్చుకోవడంతో పాటు ఫైట్లు, డాన్సులలో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్ తో ఆకట్టుకోబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీని మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ప్రకటించగా, ఆ సమయంలో రిలీజ్ చేసిన పోస్టర్ తెగ వైరల్ అయ్యింది. ఇక తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Ready for some action? @MokshNandamuri 💥💥💥#SIMBAisCOMING pic.twitter.com/dep3A1Whv9
— Prasanth Varma (@PrasanthVarma) November 29, 2024
మోక్షజ్ఞ మోడ్రన్, స్టైలిష్ లుక్ లో అద్దంలోకి చూస్తున్న సరికొత్త స్టిల్ రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ పిక్ లో మోక్షజ్ఞ ఫుల్ కాన్ఫిడెంట్ గా యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. క్యాజువల్ గళ్ళ చొక్కా ధరించి, పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్, గడ్డంతో మోక్షజ్ఞ ఉన్న ఆ పిక్ ను చూసి నందమూరి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. మోక్షజ్ఞ ఈ స్టైలిష్ లుక్ లో అయితే అదిరిపోయాడు. ఇక సినిమాలో కూడా ఇలాంటి హ్యాండ్సమ్ లుక్ ను మెయింటైన్ చేస్తే ఆయనకు ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఊహించని రేంజ్ లో పెరగడం ఖాయం. ఇక ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ కాంబోలో సినిమా రాబోతోంది అని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఒక పురాతన పౌరాణిక ఇతిహాసం నుంచి ప్రేరణ పొందిన కథ అని, విజువల్ వండర్ గా రూపొందబోతోందని తెలుస్తోంది.
Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
మొత్తానికి మోక్షజ్ఞ 'లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నా' అన్నట్టు లుక్స్ తోనే ట్రెండింగ్ లో నిలుస్తున్నాడు. మరి మూవీ రిలీజ్ అయితే రికార్డులను పాతరేసి తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటాడా అనేది చూడాలి. కాగా ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించబోతున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్ ఎప్పుడు అనే విషయాన్ని బాలయ్య రీసెంట్ గా జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో రివీల్ చేశాడు. ఈ మూవీ మైథలాజికల్ టచ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని, డిసెంబర్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అవుతుందని స్వయంగా బాలయ్య చెప్పారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.