Mohanbabu Agni Nakshtram: ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు, భయంగా ఉందంటూ ట్వీట్!
Mohanbabu Agni Nakshtram: మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న అగ్ని నక్షత్రం సినిమాలో మోహన్ బాబు ప్రొఫెసర్ విశ్వామిత్రగా కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే భయంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.
Mohanbabu Agni Nakshtram: మంచు మోహన్ బాబు నట వారసురాలిగా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి... విరామం లేని సినీ ప్రయాణం చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే పలు విభిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గానే తన కొత్త సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేసింది మంచు లక్ష్మి. ఇందుకు సంబంధించిన సినిమా ప్రమోషన్లపై ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టింది. అగ్ని నక్షత్రం అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి గత కొంత కాలంగా వరుస అప్ డేట్లు వదులుతోంది. తాజాగా సినిమాలోని మరో పాత్రను అందిరకీ పరిచయం చేసింది.
విశ్వామిత్ర పాత్రలో మోహన్ బాబు
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న అగ్ని నక్షత్రం సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మంచు మోహన్ బాబు విశ్వామిత్ర పాత్రలో కనిపించబోతున్నారు. న ఆలోచనలతో, ఆదర్శాలతో ఎవ్వరినైనా ఇట్టే ప్రభావితం చేయగల సైకియాట్రిస్చ్, ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు నటించబోతున్నట్లు మంచు లక్ష్మి తెలిపింది. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు ఓ ట్వీట్ చేశారు. తన కూతురు నిర్మిస్తున్న అగ్ని నక్షత్రం సినిమాలో మొట్ట మొదటి సారి నటించడానికి చాలా భయంగా ఉందంటూ రాసుకొచ్చారు.
నా కూతురు నిర్మిస్తూ నటిస్తున్న
— Mohan Babu M (@themohanbabu) July 31, 2022
‘అగ్ని నక్షత్రం'లో తనతో మొట్టమొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాను.
భయం భయంగా ఉంది. pic.twitter.com/keE6cbJHgh
ఒకే ఫ్రేములో తొలిసారి మోహన్ బాబు, మంచు లక్ష్మి
తండ్రీ కూతుళ్లైన మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. విశ్వంత్ ఈ సినిమాలో కఠానాయకుడిగా కనిపించబోతున్నాడు. ప్రతీక్ జోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఈ సినిమాలోని మోహన్ బాబు లుక్ ని విడుదల చేశారు. ప్రొఫెసర్ విశ్మామిత్ర పాత్రలో ఆయన సందడి చేయబోతున్నారు. మోహన్ బాబు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా నటిస్తున్నారు. చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి లిజో కె.జోష్ సింగీతం అందించగా.. మదురెడ్డి ఎడిటర్ గా, గోకుల్ భారతి కెమెరా మెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్ టత్ చేశారని, ఇది మంచు ఫ్యామిలీకి మెమరబుల్ సినిమా అవుతుందని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాతో తన మార్క్ చూపించాలని గట్టి ప్రయత్నం చేస్తోంది మంచు లక్ష్మి.