Mirai Joins 100 Crore Club: ఐదు రోజుల్లో వంద కోట్ల క్లబ్బులోకి 'మిరాయ్'... 'హనుమాన్' తర్వాత తేజా సజ్జా ఖాతాలో మరో రికార్డ్!
Mirai Movie Collection: బాక్స్ ఆఫీస్ దగ్గర 'మిరాయ్' మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో విడుదలైన ఐదు రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన రేర్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు తేజా సజ్జా.

బాక్స్ ఆఫీస్ బరిలో బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తూ రోజు రోజుకూ మరింత ముందుకు దూసుకు వెళుతోంది 'మిరాయ్'. థియేటర్లలో విడుదలైన ఐదు రోజుల్లో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. రూ. 100 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరింది. ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు...
నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్స్!
థియేటర్లలో ఓపెనింగ్ డే నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర 'మిరాయ్' తన సత్తా చాటుతూ వస్తోంది. వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్ డ్రాప్ కాలేదు. స్టడీగా ఉన్నాయి. ఐదు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల నుంచి ఈ సినిమా సాధించిన వసూళ్లు 100.40 కోట్ల రూపాయలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఓవర్సీస్ నుంచి సైతం సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. వీకెండ్ తర్వాత అక్కడ కూడా కలెక్షన్స్ బాగున్నాయి. ఇదే జోరు గనుక కొనసాగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' థియేటర్లలోకి వచ్చే సమయానికి 200 కోట్ల క్లబ్బులో చేరే అవకాశం ఉంది.
#SuperYodha HITS CENTURY 🥷🔥
— People Media Factory (@peoplemediafcy) September 17, 2025
100.40 CRORES GROSS WORLDWIDE FOR #Mirai in 5 days ❤️🔥❤️🔥❤️🔥
AN INCREDIBLE ACHIEVEMENT THAT IS BEING CELEBRATED BY ALL ❤️🙏🏻#BrahmandBlockbuster in cinemas now 💥💥💥
— https://t.co/BveSLQhrSI
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1… pic.twitter.com/NuqUpNeq7W
'హను - మాన్' తర్వాత తేజకు మరో సక్సెస్!
'మిరాయ్' కంటే ముందు తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన 'హను - మాన్' కూడా థియేటర్లలో భారీ విజయం సాధించింది. ఆ సినిమా కూడా ఐదు రోజులలో 100 కోట్ల క్లబ్బులో చేరింది. బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ డెలివరీ చేశాడు తేజ. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లతో పాటు అమెరికాలో రెండు మిలియన్ డాలర్స్ వసూలు చేసిన సినిమాలు ఇప్పుడు తేజ ఖాతాలో రెండు ఉన్నాయి.
Also Read: త్వరలో ఓటీటీకి 'జూనియర్'... కిరీటి రెడ్డి, శ్రీ లీల సినిమా స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన 'మిరాయ్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్ చేశారు. హీరోతో పాటు విలన్ కూడా అద్భుతంగా నటించారని ప్రశంసలు వచ్చాయి. తేజ తల్లిగా శ్రియ కొత్త తరహా పాత్రలో చక్కటి నటన కనబరిచారు. హీరోయిన్ రితిక నాయక్ నటన కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కథకుడిగా, దర్శకుడిగా, చాయాగ్రహకుడిగా కార్తీక్ ఘట్టమనేని పని తీరుపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సంగీత దర్శకుడు హరి గౌర అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.





















