Mirai Movie Ticket Bookings: మిరాయ్ బుకింగ్స్ మొదలు... తక్కువ టికెట్ రేట్లతో రికార్డులపై కన్నేసిన తేజా సజ్జా
Mirai Movie Updates: హనుమాన్ విజయం తర్వాత తేజా సజ్జా హీరోగా నటించిన సినిమా 'మిరాయ్'. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. అందరికీ అందుబాటులో టికెట్ రేట్స్ ఉన్నాయి.

గత ఏడాది సంక్రాంతికి 'హను - మాన్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యువ కథానాయకుడు తేజా సజ్జా (Teja Sajja). అందులో సూపర్ హీరోగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. 'హను - మాన్' తర్వాత తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన సినిమా 'మిరాయ్' (Mirai Movie). ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ బేస్ చేసుకుని తీసిన సినిమా. ఈ శుక్రవారం... సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లలోకి వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి.
డిస్ట్రిక్ట్ యాప్‌లో బుకింగ్స్ మొదలు!
ఫుడ్ డెలివరీ ఆప్ జోమాటో నుంచి టికెట్ బుకింగ్స్ యాప్ డిస్ట్రిక్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో 'మిరాయ్' బుకింగ్స్ మొదలు అయ్యాయి. ఆడియన్స్ అందరికీ అందుబాటు రేట్లలో సినిమా టికెట్ ప్రైజ్ ఉంటుందని హీరో తేజా సజ్జా చెప్పిన సంగతి తెలిసిందే.
'మిరాయ్' టికెట్ రేటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 నుంచి 175 రూపాయల మధ్యలో ఉంది. మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో టికెట్ రేటు 250 రూపాయల లోపే ఉంటుందని సమాచారం. త్వరలో బుక్ మై షో యాప్‌లో కూడా టికెట్స్ ఓపెన్ చేయనున్నారు. టికెట్ రేట్స్ హైక్ లేకపోవడం వల్ల కుటుంబ ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఒక టికెట్ తెగే చోట నాలుగు టికెట్స్ తెగుతాయి. అలా తక్కువ టికెట్ రేట్లతో రికార్డ్స్ మీద కన్నేశాడు తేజా సజ్జా.
#MIRAI BOOKINGS OPEN NOW Exclusively on @district_india 💥💥💥
— People Media Factory (@peoplemediafcy) September 9, 2025
Experience India’s Most Ambitious Action Adventure with your KIDS & FAMILIES Only on the BIG SCREENS ❤️🔥
— https://t.co/wUh7ZlcKM2
GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🔥
Superhero @tejasajja123
Rocking Star… pic.twitter.com/SjdiHzN1Pm
కుటుంబ ప్రేక్షకులంతా కలిసి చూసేలా 'మిరాయ్' ఉంటుందని, ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ ఇస్తుందని విశాఖలో జరిగిన రిలీజ్ కార్యక్రమంలో తేజా సజ్జా చెప్పారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో విడుదల అవుతోందీ సినిమా. 'హను - మాన్' తర్వాత మరోసారి సంగీత దర్శకుడు హరి గౌరతో కలిసి తేజా సజ్జా ఈ సినిమా చేశారు. ఇందులో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయనది యాంటీ హీరో క్యారెక్టర్ అని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన 'మిరాయ్' సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే హిట్ అనే వైబ్ ఇచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇందులో శ్రియా శరణ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?





















