Megastar Chiranjeevi 70th Birthday : చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. మెగాస్టార్ ఫిట్‌నెస్, డైట్ సీక్రెట్స్
Megastar Chiranjeevi 70th Birthday : 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి ఎలా ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉన్నారు? ఆయన ఫిట్‌నెస్ రొటీన్, డైట్ హ్యాబిట్స్, లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ ఇప్పుడు చూసేద్దాం.

Chiranjeevi Fitness Routine & Diet : పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే (Megastar Chiranjeevi Birthday)జరుపుకుంటున్నారు. 7 పదుల వయసులో కూడా యంగ్‌గా,యాక్టివ్‌గా ఉంటూ.. గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్‌లు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు చిరు. ఇంత వయసు వచ్చినా ఆయన ఇప్పటికీ ఇంత యాక్టివ్‌గా ఉన్నారంటే.. ఆయన ఫాలో అయ్యే ఫిట్‌నెస్, డైట్‌నే కారణం. మరి ఆయన ఫాలో అయ్యే డైట్ ఏంటి? ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వయసు పెరిగే కొద్ది శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కానీ చిరు మాత్రం రివర్స్‌లో వెళ్తున్నారు. ఇండస్ట్రీలో ఉండేవారు ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటూ.. వయసు పెరిగినా.. ఇంకా యంగ్‌గా మారుతూ ఇన్స్ప్రేషన్గా నిలుస్తున్నారు. అలాంటివారిలో చిరు ముందువరసలో ఉంటారు. 70 ఏళ్లల్లో కూడా హీరోగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలను తలపించేలా డ్యాన్స్ చేస్తూ తన సత్తా చాటుకుంటున్నారు. ఇలా ఫిట్‌గా ఉండేందుకు చిరు ఫాలో అయ్యే ఫిట్‌నెస్ రొటీన్ ఏంటంటే..
ఫిట్‌నెస్ రొటీన్..
చిరు ప్రధానంగా బాడీ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్, స్టామినా పెంచుకునేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తారు. ఇవి శరీరం బరువు పెరగకుండా మెటబాలీజం పెంచడంలో, హెల్తీగా, యాక్టివ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఆ మధ్య విశ్వంభర సినిమా కోసం జిమ్‌లో చేస్తోన్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. దానిలో చిరు బెంచ్ ప్రెస్, డంబెల్ కర్ల్స్, స్క్వాడ్స్, కార్డియోపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
బెంచ్ ప్రెస్ చేయడం వల్ల ఛాతి, భుజాలు, ట్రైసెప్స్ స్ట్రాంగ్ అవుతాయి. వయసు ద్వారా కలిగే కండర ద్రవ్యరాశి లోపం కంట్రోల్ అవుతుంది. కండర బలం, స్టామినా పెరుగుతుంది. డంబెల్ కర్ల్స్ చేతులకు ఆకృతినిచ్చి బైసెప్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. గ్రిప్ స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. తొడలు, హిప్స్, లెగ్ మజిల్ గ్రోత్‌కి స్క్వాట్స్ హెల్ప్ అవుతాయి. కేలరీలు ఎక్కువగా బర్న్ అవ్వడంతో పాటు బాడీ బ్యాలెన్స్ అవుతుంది. వెన్నెముకను స్ట్రాంగ్ చేసేందుకు డెడ్ లిఫ్ట్ హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కార్డియో కాపాడుతుంది. కాబట్టి బాస్ ఇవన్నీ చేస్తూ.. 70 ఏళ్ల వయసులో కూడా తన యాక్షన్, గ్రేస్‌తో రఫ్పాడిస్తున్నారు.
చిరంజీవి డైట్..
చిరు డైట్‌కి సంబంధించిన టిప్స్ అన్ని తన కొడుకు, హీరో రామ్ చరణ్ ఇస్తారని ఓ సందర్భంలో తెలిపారు. ప్రోటీన్ తీసుకోవడం నుంచి ఫుడ్ వరకు ఎన్నో సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. అయితే చిరు ఎక్కువగా వెజిటేరియన్ డైట్ తీసుకుంటారు. బ్యాలెన్స్డ్గా ఉండే మీల్స్ ఆయన డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. బయటి భోజనం కంటే ఇంటి భోజనానికే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే సలాడ్స్, సూప్స్ ఎక్కువగా తీసుకుంటారు.
ఈ ఫిట్‌నెస్, డైట్ ఇప్పటివి కావు. ఈ వయసులో కూడా అంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంటుందని గుర్తించుకోవాలి. ఎంత చిన్న వయసునుంచి ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తే.. పెద్దయ్యే కొద్ది మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మీరు కూడా చిరంజీవిలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉండాలనుకుంటే.. ఈ రోజు నుంచే ఫిట్‌నెస్ రొటీన్ ప్రారంభించండి. మరచిపోకుండా ఆయనకి బర్త్‌డే విష్ చెప్పేయండి.






















