Mega Vs Allu: శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?
Allu Sirish Engagement: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, రామ్ చరణ్, వరుణ్ తేజ్ దంపతులు సందడి చేశారు. ఉపాసన సీమంతంలో?

మెగా, అల్లు కుటుంబాల మధ్య బంధుత్వం గురించి అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి, టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావ బామ్మర్దిగా కంటే స్నేహితులుగా మెలుగుతారు. పిల్లలు రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలు అయ్యాక రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. పిల్లల మధ్య పొరపచ్చాలు వచ్చాయని ప్రచారం మొదలైంది. ఎప్పటికప్పుడు కలుస్తూ ఆ తరహా గాసిప్పులకు చెక్ పెడుతున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇష్యూలు వస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని రెండు శుభకార్యాల ద్వారా అర్థం అవుతోందని ఇండస్ట్రీలో లేటెస్ట్ గుసగుస.
శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ సందడి
అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం జరిగింది. 'మన శంకర వరప్రసాద్' షూటింగ్ చేస్తున్న చిరంజీవి, సెట్స్ నుంచి నేరుగా నిశ్చితార్థానికి వెళ్లారు. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో పాటు శిరీష్ మేనత్త - చిరు భార్య సురేఖ సైతం అటెండ్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబుతో పాటు ఆయన పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక, కోడలు లావణ్య త్రిపాఠి సైతం నిశ్చితార్థానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, మెగా మేనల్లుళ్లు సాయి దుర్గా తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ సైతం వచ్చారు.
శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేశారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. ఆయన అమరావతిలో ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబోయే కొత్త జంట శిరీష్ - నయనికతో మెగా ఫ్యామిలీ దిగిన ఫోటోలను అల్లు కుటుంబం విడుదల చేశారు. అక్కడి వరకు ఓకే. మరి మెగా ఫ్యామిలీలో జరిగిన శుభకార్యంలో అల్లు ఫ్యామిలీ ఎందుకు లేదు!?
ఉపాసన సీమంతంలో అల్లు వారు ఎక్కడ?
శిరీష్ నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు, దీపావళి నాడు మెగా కుటుంబంలో ఓ శుభకార్యం జరిగింది. ఉపాసన సీమంతం నిర్వహించారు. కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ దంపతులతో పాటు 'మన శంకర వరప్రసాద్ గారు'లో చిరు జంటగా నటిస్తున్న నయనతార సైతం హాజరయ్యారు. వాళ్ళందరి ఫోటోలను స్వయంగా చిరంజీవి షేర్ చేశారు. దీపావళికి వచ్చారని పేర్కొన్నారు. తర్వాత సీమంతం వీడియో ఉపాసన షేర్ చేశారు. అందులో నాగార్జున, వెంకటేష్, నయనతార ఉన్నారు. సో సీమంతం వేడుకకు వాళ్ళందరూ వచ్చినట్టు అర్థమైంది. అక్కడి వరకు ఓకే.
ఉపాసన సీమంతంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. మెగా ఫ్యామిలీ విడుదల చేసిన ఫోటోల్లో రామ్ చరణ్ మేనమామ అల్లు అరవింద్ గానీ, ఆయన పిల్లలు అల్లు అర్జున్ లేదా శిరీష్ కనిపించలేదు. నిజానికి సీమంతానికి వాళ్ళు సైతం అటెండ్ అయ్యారని కానీ వాళ్ళ ఫోటోలు, విడుదల విడుదల చేయలేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో మెగా ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. మెగా కుటుంబంలో అల్లును కట్ చేసింది ఎవరో అని డిస్కషన్ జరుగుతోందట. మెగా, అల్లు కుటుంబ సభ్యులకు ఆ సంగతి తెలియాలి.





















