Star Kid: ఈ స్టార్ కిడ్ 2591 కోట్లకు వారసుడు.... పదిహేనేళ్లకు ఇల్లు వదిలేశాడు... సెకండ్ హ్యాండ్ డ్రస్‌లు, ఆటో రైడ్‌లు
Star Kid : 2591 కోట్లకు వారసుడైన ఓ స్టార్ కిడ్ 15 ఏళ్లకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకుంటాడు. కోట్ల ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ ఆటోలోనే ప్రయాణం చేస్తాడు. అతడెవరో గుర్తు పట్టారా?

స్టార్ కిడ్స్ అంటే సాధారణంగా కాలు కింద పెట్టరు. ఖరీదైన కార్లలో తిరుగుతూ, బ్రాండెడ్ దుస్తులు ధరిస్తూ, ఎప్పుడూ పార్టీలు అంటూ ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. కానీ ఓ స్టార్ కిడ్ మాత్రం వేల కోట్ల ఆస్తులకు వారసుడు అయినప్పటికీ... 15 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఈ స్టార్ కిడ్ సెకండ్ హ్యాండ్ దుస్తులను ధరిస్తాడు. అంతేకాదు కోట్ల ఖరీదు చేసే కార్లు ఉన్నప్పటికీ ఆటోలోనే ప్రయాణిస్తాడు. ఆ స్టార్ కిడ్ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాల ముద్దుల కొడుకు ఆరవ్ కుమార్.
యాక్టింగ్ కాదు, ఫ్యాషన్ వైపే మొగ్గు
అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నా దంపతుల కొడుకు ఆరవ్ కుమార్. ఆయన వయసు 22 ఏళ్ళు. జనాల దృష్టికి దూరంగా జీవితాన్ని గడుపుతున్న ఈ స్టార్ కిడ్ రీసెంట్ గా హుమా ఖురేషి ఇచ్చిన ఈద్ పార్టీలో సందడి చేయడం నెట్టింట సంచలనం సృష్టించింది. ఇక ఆయనతో వచ్చిన మరో యువతి కూడా హాట్ టాపిక్ గా మారింది. క్లాసిక్ వైట్ పైజామాపై నల్లటి కుర్తా ధరించి ఆరవ్ హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఈ సందర్భంగా ఆరవ్ ని ఆయన తాత, దిగ్గజ నటుడు రాజేష్ ఖన్నాతో పోల్చారు నెటిజెన్లు. ఇక అతని పక్కనున్న అందమైన అమ్మాయి ఆయన బంధువు అని తేలడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.
నిజానికి చాలామంది స్టార్ కిడ్స్ సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ తాతల తరం నుంచి సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఫ్యామిలీలో జన్మించిన ఆరవ్ మాత్రం ఎప్పుడూ యాక్టింగ్ వైపు మొగ్గు చూపలేదు. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. నాలుగు సంవత్సరాల వయసులోనే మార్షల్ ఆర్ట్స్ మొదలు పెట్టి, కుడో, గోజు ర్యు కరాటేలో బ్లాక్ బెల్ట్, జాతీయస్థాయిలో జూడో పోటీలో బంగారు పతకాన్ని కూడా దక్కించుకున్నాడు. ఇక ఆరవ్ ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
15 ఏళ్లకే ఇంటికి దూరం
ట్వింకిల్ ఖన్నా తన కొడుకు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అతను 15 ఏళ్ల వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్ కు వెళ్ళినట్టు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా ఆరవ్ తన భోజనాన్ని తానే వండుకుంటాడు. బట్టలు స్వయంగా ఉతుక్కుంటాడు. అంతేకాకుండా షాపింగ్ చేయడానికి ఇష్టపడతాడు. మినిమలిజం ఎక్కువగా నమ్మే అతను దుకాణాలలో బేరాలు కూడా ఆడతాడట. ఆరవ్ ముంబైలోని ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకున్నాడు. తరువాత సింగపూర్‌లోని యునైటెడ్ వరల్డ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. ఫ్యాషన్ డిజైనింగ్ పై దృష్టి సారించిన ఆరవ్ లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆయన తండ్రి అక్షయ్ కుమార్ కి ప్రస్తుతం రూ. 2591 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ ఆరవ్ మాత్రం సింపుల్ గా ఉండడం ఆయనకు కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

