Matka Censor Review - 'మట్కా' సెన్సార్ రివ్యూ: క్లైమాక్స్ యాక్షన్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ - రన్ టైమ్ ఎంత? ఇంకా సినిమా టాక్!
Matka Movie First Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'మట్కా' ఈ నెల 14న విడుదల కానుంది. రీసెంట్‌గా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. మరి, సెన్సార్ మెంబర్స్ ఇచ్చిన రివ్యూ ఎలా ఉందో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మట్కా' (Matka Movie). ఈ గురువారం (నవంబర్ 14న) థియేటర్లలోకి వస్తోంది. ఇటీవల సెన్సార్ పూర్తి అయ్యింది. యు / ఎ సర్టిఫికెట్ లభించింది. మరి, 'మట్కా'కు సెన్సార్ సభ్యులు ఇచ్చిన రివ్యూ ఎలా ఉందో తెలుసా?
క్లైమాక్స్ బిగ్గెస్ట్ అట్రాక్షన్...
ఇంటర్వెల్ ముందు నాలుగు ఫైట్స్!
'మట్కా' స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి సాంగ్ ఒక పంచ్ అన్నట్టు ఉంటుందట. క్యారెక్టర్ పరంగా వరుణ్ తేజ్ గెటప్స్ హైలైట్ అవుతాయని టాక్. ఆ వాసు పాత్రకు తగ్గట్టు వివిధ దశలకు తగ్గట్టు మెగా ప్రిన్స్ నటనలో గానీ, లుక్స్‌లో గానీ చూపించిన వేరియేషన్ హైలైట్ అవుతుందని... నటుడిగా వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కే సినిమా 'మట్కా' అని తెలిసింది.
Matka Movie First Review: ఇంటర్వెల్ ముందు (ఫస్ట్ హాఫ్)లో నాలుగు ఫైట్స్ ఉంటాయని యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందింది. ఆ నాలుగూ బాగా వచ్చాయని సెన్సార్ టాక్. ఇక, క్లైమాక్స్ వచ్చేసరికి భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని అంటున్నారు. దర్శకుడు కరుణ కుమార్ రాసిన కథ, తీసిన తీరు బావుందట. అయితే... డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవల్ అంటున్నారు.
'మట్కా' రన్ టైమ్ ఎంత?
ఇంటర్వెల్ ముందు, తర్వాత!
Matka Movie Runtime: 'మట్కా' మూవీ టోటల్ రన్ టైమ్ 2.39 గంటలు. అది కూడా టైటిల్ కార్డులతో కలిపి. అందులో ఫస్ట్ హాఫ్ రన్ టైమ్ 1.22 అవర్స్ అయితే... ఇంటర్వెల్ తర్వాత (సెకండ్ హాఫ్) రన్ టైమ్ 1.11 అవర్స్. దీన్ని కథగా కంటే వాసు అనే వ్యక్తి జీవితంలో టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు జరిగే కీలకమైన ఘటనల సమాహారంగా సినిమాను తీశారు. ఓ వ్యక్తి జీవితం అయినప్పటికీ... క్రిస్పీగా తక్కువ రన్ టైంలో తీయడం వల్ల సినిమా పరుగులు పెడుతున్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుందని సెన్సార్ మెంబర్స్ నుంచి వచ్చిన టాక్.
'కంగువ'తో స్క్రీన్ షేర్స్ చేసుకోవడం ప్లస్సా? మైనస్సా?
నవంబర్ 14న 'మట్కా'తో పాటు 'కంగువ' కూడా థియేటర్లలోకి వస్తోంది. రెండు భారీ సినిమాలు ఓకే రోజు రావడం వల్ల, స్క్రీన్ షేర్స్ చేసుకోవడం వల్ల ప్లస్సా? మైనస్సా? అని కొంత చర్చ జరుగుతోంది. అయితే... సంక్రాంతి వంటి పండగలకు మూడు నాలుగు సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, ఒకే రోజు రావడం మైనస్ ఏమీ కాదు. బావున్న సినిమాకు మంచి టాక్ వస్తుంది. ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ మూవీ అవుతుంది. నెక్స్ట్ మరొక సినిమాకు వెళతారు.