OTT Releases This Week: ఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా
Maa Nanna Superhero OTT Release Date: సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా 'మా నాన్న సూపర్ హీరో' ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది జీ 5 నెట్వర్క్.
నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu)కు యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది. ఆయన ప్రతి సినిమాలో సిక్స్ ప్యాక్ చూపిస్తారని పేరు ఉంది. అయితే... ఒక్క యాక్షన్ సీన్ లేకుండా, సిక్స్ ప్యాక్ చూపించకుండా ఆయనో సినిమా చేశారు. అది ఈ వారం ఓటీటీలో వీక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
Maa Nanna Superhero OTT Streaming Date and Platform: సుధీర్ బాబు హీరోగా నటించిన ఫాదర్ సెంటిమెంట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'ను ఈ శుక్రవారం (నవంబర్ 15వ తేదీ) నుంచి తమ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు 'జీ 5' ఓటీటీ పేర్కొంది.
'ఓ కుమారుడి అందమైన, భావోద్వేగమైన ప్రయాణాన్ని మా ఓటీటీ వేదికలో చూడండి. అస్సలు మిస్ కావొద్దు. తండ్రులు అందరికీ ఈ సినిమా అంకితం' అని 'జీ 5' పేర్కొంది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడమని సలహా ఇచ్చింది.
View this post on Instagram
'మా నాన్న సూపర్ హీరో' కథ ఏమిటి?
జానీ (సుధీర్ బాబు) బాల్యంలో అతడిని కన్న తండ్రి ఓ అనాథ ఆశ్రమంలో వదిలి వెళతాడు. రెండు రోజుల్లో వచ్చి తనయుడిని తీసుకు వెళతానని చెబుతాడు. కానీ, రోజులు గడిచినా రాడు. అక్కడి నుంచి అతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటారు.
తొలుత జానీని కన్న కొడుకు అంటే ఎక్కువగా చూసుకుంటాడు శ్రీనివాస్. కానీ, ఆ తర్వాత కొన్నాళ్లకు వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆస్తి కోల్పోవడంతో జానీ వచ్చిన తర్వాత తనకు బ్యాడ్ లక్ మొదలైందని దూరం పెడతాడు. తండ్రి ఎంత కోప్పడినా, అప్పులు చేసి జనాలు ఇంటికి వచ్చేలా చేసినా ఓపిగ్గా అన్నీ తీరుస్తాడు. మరోవైపు జానీ కోసం కన్న తండ్రి వెతకడం మొదలు పెడతాడు. సుమారు 20 ఏళ్ల తర్వాత కన్న తండ్రి ఎందుకు వెతుకుతున్నాడు? అతడికి జానీ దొరికాడా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
'మా నాన్న సూపర్ హీరో' సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పతాక సన్నివేశాలు ఏడిపించేశాయని చెప్పారు. మరి, ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఆయన 'లూజర్' వెబ్ సిరీస్ తీశారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: అల్లు అర్జున్‌కు వరుణ్ తేజ్ ఇన్ డైరెక్ట్ కౌంటర్ - 'మట్కా' ప్రీ రిలీజ్‌లో ఆ డైలాగ్ బన్నీకేనా?