Mass Jathara Pre Release Event: ఇవాళే మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్... ముఖ్య అతిథి నుంచి వెన్యూ, టైమ్ వరకు - ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి
Mass Jathara Pre Release Event Venue: మాస్ మహారాజా రవితేజ నటించిన 75వ సినిమా 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్‌లో జరుగుతుంది. గెస్ట్ నుంచి వెన్యూ వరకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.

Mass Jathara Movie Pre Release Event Full Details: 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఇవాళే. మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో మరింత క్రేజ్ నెలకొంది. దాంతో ప్రీ రిలీజ్ వేడుక కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్‌కు వచ్చే ముఖ్య అతిథి ఎవరు? ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇంకా గెస్ట్స్ ఎవరు? వంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.
'మాస్ జాతర' ఈవెంట్ జరిగేది ఎక్కడ?
వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ప్లానింగ్!
Mass Jathara Pre Release Event Venue In Hyderabad: 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ సిటీలో ఏర్పాట్లు చేశారు. ఈ మధ్య అనూహ్యంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వల్ల ప్లానింగ్ ప్రకారం 'ఓజీ' ఈవెంట్ జరగలేదు. అందుకని, 'మాస్ జాతర' కోసం ఇండోర్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఫిల్మ్ నగర్ డౌన్, మణికొండ మధ్యలో గల జేఆర్‌సీ కన్వెషన్ సెంటర్‌లో 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేశారు.
'మాస్ జాతర' వేడుకకు ముఖ్య అతిథి ఎవరు?
Who Is The Chief Guest Of Mass Jathara Pre Release Event: 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ వేడుకకు కోలీవుడ్ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా వస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. దాంతో పాటు 'మాస్ జాతర'ను సైతం శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
'మాస్ జాతర'కు సూర్య ముఖ్య అతిథి కాగా... దర్శకుడు వెంకీ అట్లూరి, ఇంకా సితార సంస్థలో సినిమాలు చేస్తున్న దర్శక రచయితలు కొందరు రానున్నట్లు తెలిసింది. 'మాస్ జాతర' హీరోయిన్ శ్రీలీలతో పాటు మిగతా చిత్ర బృందం సైతం సందడి చేయనుంది.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
'మాస్ జాతర' ఈవెంట్ ఎన్ని గంటలకు జరుగుతుంది?
Mass Jathara Pre Release Event Time Date: అక్టోబర్ 28 (మంగళవారం) సాయంత్రం ఐదున్నర గంటల నుంచి 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. అయితే ఈవెంట్ మొదలు అయ్యేసరికి ఆరున్నర, ఏడు గంటలు అయ్యే అవకాశం ఉంది. అయితే అభిమానులు ముందుగా ఈవెంట్ వెన్యూ దగ్గరకు చేరుకోవడం మంచిది. లేటుగా వెళితే జేఆర్‌సీ కన్వెషన్ సెంటర్‌లోకి వెళ్లడం కష్టం అవుతుంది. రవితేజ, సూర్యను దగ్గర నుంచి చూడలేరు కూడా!
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!
'మాస్ జాతర'తో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, నవీన్ చంద్ర, హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు.





















