అన్వేషించండి

Rishab Shetty: మాయావి కాదు... రిషబ్ శెట్టే - 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!

Who Is Mayakara In Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1'లో 'మాయావి' (కన్నడలో మాయ కర) క్యారెక్టర్ చేసింది రిషబ్ శెట్టి అని హోంబలే ఫిలిమ్స్ తెలిపింది. మేకప్ కోసం 6 గంటలు కేటాయించినట్టు వివరించింది.

'కాంతార చాప్టర్ 1'లో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. విమర్శకుల నుంచి సామాన్యుల వరకు ఆయన తప్ప మరొకరు ఆ పాత్ర చేయలేరని ప్రశంసించారు. 'కాంతార'కు నేషనల్ అవార్డు అందుకున్న ఆయన, మరోసారి అందుకునే అవకాశం ఉందని పలువురు జోస్యం చెప్పారు. 'కాంతార చాప్టర్ 1'లో బెర్మే పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. అది అందరికీ తెలుసు. అయితే సినిమా ప్రారంభంలో, మధ్యలో కీలక సన్నివేశాల్లో, క్లైమాక్స్‌లో వచ్చే 'మాయావి' (కన్నడలో మాయ కర) పాత్రలో కూడా రిషబ్ శెట్టి నటించారని తెలుసా?

మాయావి మేకప్ కోసం 6 గంటలు!
Who Played Mayakara In Kantara Chapter 1?: 'కాంతార చాప్టర్ 1'లో మాయావి పాత్రలో నటించింది ఎవరు? ఈ ప్రశ్నకు స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సమాధానం చెప్పింది. అదీ వీడియో రూపంలో!

మాయావి మేకప్ కోసం ఆరు గంటలు పట్టింది. మాయావి పాత్ర నేపథ్యంలో సీన్స్ తీసినప్పుడు తెల్లవారుజామున ఆరు గంటలకు రిషబ్ శెట్టి సెట్స్‌కు వచ్చారని, అప్పుడు కూర్చుంటే తొమ్మిది గంటల వరకు మేకప్ కోసం టైం స్పెండ్ చేశారని చెప్పుకొచ్చింది హోంబలే ఫిలిమ్స్ సంస్థ. మేకప్ ఎలా వేసినది వీడియో తీసి మరీ పోస్ట్ చేసింది. రిషబ్ శెట్టి డెడికేషన్, కమిట్మెంట్ చూసి క్లాప్స్ కొడుతున్నారు ఆడియన్స్.

Also Read: అనిల్ రావిపూడి కాదు... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ - దిల్ రాజు సినిమా?

'కాంతార'కు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక, ఈ 'కాంతార చాప్టర్ 1'కు సైతం ఆయనకు నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అని మాయావి క్యారెక్టర్ మేకప్ వీడియో చూశాక పలువురు అభిప్రాయపడుతున్నారు. 'కాంతార'లో చేసిన పాత్రకు, ఇప్పుడీ ప్రీక్వెల్‌లో చేసిన రెండు పాత్రలకు అసలు సంబంధం లేదు. ఆ మూడూ వేర్వేరు పాత్రలు. డిఫరెన్స్ ఉంది. పైగా, ఇప్పుడు ఒక్క సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు రిషబ్ శెట్టి. రెండు రోల్స్ మధ్య చాలా వేరియేషన్ చూపించారు. అందువల్ల ఆయనకు నేషనల్ అవార్డు ఇవ్వడంలో తప్పు లేదనేది అభిమానులతో పాటు కొందరు విశ్లేషకులు చెప్పే మాట.

Also Readప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ రీల్... ఇన్‌స్టాలో వైరల్ వీడియో

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hombale Films (@hombalefilms)

ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతోంది 'కాంతార చాప్టర్ 1'. థియేటర్లలో ఈ సినిమా విడుదలై 25 రోజులు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో కనకవతి పాత్రలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటించగా... రాజుగా మలయాళ నటుడు జయరామ్, ఆయన కుమారుడిగా హిందీ నటుడు గుల్షన్ దేవయ్య తదితరులు నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Embed widget