అన్వేషించండి

Pawan Kalyan: అనిల్ రావిపూడి కాదు... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ - దిల్ రాజు సినిమా?

Pawan Kalyan Dil Raju Movie: 'ఓజీ'తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ వరుస సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.

Pawan Kalyan Next Movie After OG: 'ఓజీ' (దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ కొట్టారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఈ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ దగ్గర పవన్ స్టామినా ఎలా ఉంటుందనేది మరోసారి చూపించింది. 'ఓజీ' తర్వాత పవన్ ఎవరితో సినిమా చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ తర్వాత?

'దిల్' రాజు నిర్మాణంలో పవన్ హీరోగా...
అనిల్ బదులు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో!
రాజకీయాల కోసం సినిమాలకు కొంత విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్, చిన్న గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో థియేటర్లలోకి వచ్చారు. ఆ సినిమాను 'దిల్' రాజు (Dil Raju) ప్రొడ్యూస్ చేశారు. 'ఓజీ'ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా ఆయనే. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

'ఓజీ' సక్సెస్ తర్వాత ఓ థియేటర్‌లో పవన్ అభిమానులతో మాట్లాడిన 'దిల్' రాజు, త్వరలో ఆయనతో సినిమా చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. పవన్ - 'దిల్' రాజు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనిల్ బదులు వంశీ పైడిపల్లి పేరు తెరపైకి వచ్చింది. దిల్ రాజుతో వంశీ పైడిపల్లికి మంచి అనుబంధం ఉంది. దాంతో ఆయనకు దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నారట.

Also Readప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ రీల్... ఇన్‌స్టాలో వైరల్ వీడియో

ఒక్క 'ఊపిరి' మినహా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ 'దిల్' రాజు నిర్మాత. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా 'వారసుడు' (తమిళంలో 'వారిసు')ను ప్రొడ్యూస్ చేసింది కూడా దిల్ రాజే. 'వారసుడు' తర్వాత బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా సినిమా చేయడానికి ట్రై చేశారు. మొదట ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... ఆ తర్వాత వెనకడుగు వేశారు. ఆ కథతో సల్మాన్ ఖాన్ దగ్గరకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయో గానీ... ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేసే అవకాశాన్ని వంశీ పైడిపల్లికి ఇవ్వాలని 'దిల్' రాజు భావించారట. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని టాక్. 

Also Readరజనీకాంత్ 'జైలర్ 2'లో బాలీవుడ్ భామ.. విలన్ కూతురిగా!?

'ఓజీ' సక్సెస్ తర్వాత 'ఓజీ యూనివర్స్' చేస్తానని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత నిర్మాత రామ్ తాళ్ళూరికి ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చినట్టు తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా సినిమా చేస్తున్నట్లు రామ్ తాళ్ళూరి ఎప్పుడో అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా దిల్ రాజుకు మరో సినిమా చేస్తున్నట్లు టాక్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast Case Update: సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
Ravi Teja : మాస్ మహారాజ రవితేజతో సమంత! - ఫేమస్ డైరెక్టర్ విత్ థ్రిల్లింగ్ స్టోరీ
మాస్ మహారాజ రవితేజతో సమంత! - ఫేమస్ డైరెక్టర్ విత్ థ్రిల్లింగ్ స్టోరీ
Advertisement

వీడియోలు

విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast Case Update: సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
Ravi Teja : మాస్ మహారాజ రవితేజతో సమంత! - ఫేమస్ డైరెక్టర్ విత్ థ్రిల్లింగ్ స్టోరీ
మాస్ మహారాజ రవితేజతో సమంత! - ఫేమస్ డైరెక్టర్ విత్ థ్రిల్లింగ్ స్టోరీ
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Snowfall Destinations in India : ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
Bus Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది భారతీయులు సజీవ దహనం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది భారతీయులు సజీవ దహనం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
Embed widget