Kiccha Sudeep Mark: త్రిశూలం పట్టిన కన్నడ హీరో... క్రిస్మస్ బరిలో సినిమా!
Mark Telugu Trailer: క్రిస్మస్ బరిలో మరో సినిమా చేరింది. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కన్నడ హీరో కిచ్చా సుదీప్ 'మార్క్' సైతం డిసెంబర్ ఆఖరి వారంలో రానుంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

Trishul In Movies - Akhanda 2 & Mark: 'అఖండ 2' కోసం గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ త్రిశూలం పట్టారు. టీజర్ నుంచి ట్రైలర్ వరకు... త్రిశూలంతో ఆయన చేసిన ఫైట్లు ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు కన్నడ హీరో కిచ్చా సుదీప్ సైతం త్రిశూలాన్ని పట్టి ఫైట్లు చేశారు. అయితే ఆయనది భక్తి సినిమా కాదు, పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమా.
మార్క్ ట్రైలర్ రిలీజ్... ఎలా ఉందంటే?
Kiccha Sudeep's Mark Movie Trailre Review Telugu: తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్. ఆయన నటించిన తాజా సినిమా 'మార్క్'. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. సిటీలో వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులు కొంత మంది కిడ్నాప్ అవుతారు. దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంటుంది. ఈ కిడ్నాప్ కహానీని కథానాయకుడు ఎలా చేధించాడు? అనేది సినిమా.
Also Read: Akhanda 2 Postponed Effect: 'అఖండ 2' వాయిదాను క్యాష్ చేసుకున్న హిందీ సినిమా!
'మార్క్' ట్రైలర్ చూస్తే... ఇదొక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని అర్థం అవుతోంది. కన్నడలో కిచ్చా సుదీప్ స్టార్ ఇమేజ్ బేస్ చేసుకుని ఫైట్లు డిజైన్ చేశారు. అయితే అందులో భక్తికి కూడా చోటు కల్పించారు. జాతర నేపథ్యంలో ఓ ఫైట్ తీశారు. అక్కడ త్రిశూలం పట్టుకుని కిచ్చా సుదీప్ ఫైట్ చేశారు.
Also Read: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన 'ధురంధర్'... దొంగ నోట్ల పాపం వాళ్ళదేనా!?
క్రిస్మస్ బరిలో 'కిచ్చా' సుదీప్ 'మార్క్' రిలీజ్!
Mark Movie Release Date: డిసెంబర్ 25న 'మార్క్'ను రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తెలుగులో రోషన్ మేక 'ఛాంపియన్', మోహన్ లాల్ 'వృషభ', ఆది సాయి కుమార్ 'శంబాల', నవదీప్ - శివాజీల 'దండోరా', 'పతంగ్' తదితర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సుదీప్ సినిమా యాడ్ అయ్యింది. క్రిస్మస్ బరిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు సుమారు అరడజను సినిమాలు వచ్చే అవకాశం ఉంది.





















