Hebah Patel: అనిరుద్ జంటగా హెబ్బా పటేల్... యాక్షన్ ప్యాక్డ్ 'మారియో' ఫస్ట్ లుక్ రిలీజ్
'కుమారి 21ఎఫ్' పాపులరైన ముంబై ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. కొంత గ్యాప్ తర్వాత యాక్షన్ ప్యాక్డ్ సినిమాతో ఆమె ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

Hebah Patel New Movie: తెలుగులో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కు హెబ్బా పటేల్ అంటే క్రేజ్. 'కుమారి 21ఎఫ్'తో వచ్చిన ఇమేజ్ అటువంటివి. ఆ తర్వాత ఆవిడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. అయితే ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది హెబ్బా. ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేస్తున్నారు. అందులో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
అనిరుద్ జంటగా హెబ్బా పటేల్!
అనిరుద్ అంటే సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అనుకునేరు. కాదండీ... అనిరుద్ పేరుతో ఓ యంగ్ హీరో ఉన్నాడు. అతనికి జంటగా హెబ్బా పటేల్ యాక్ట్ చేస్తున్న సినిమా 'మారియో'. ఎ టర్బో - చార్జ్డ్ ర్యాంప్ రైడ్... అనేది ఉపశీర్షిక.
'మారియో' ఫస్ట్ లుక్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అది చూస్తే... అనిరుద్, హెబ్బా పటేల్ మోడ్రన్ డ్రస్‌లలో ఉన్నారు. హీరో ఒక చేతితో రైఫిల్ పట్టుకుని మరొక చేతితో హెబ్బా పటేల్ నడుమును పట్టుకున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీతో పాటు సినిమా థీమ్ సూచించేలా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు క్లాసిక్ కారు, చీకటి, వర్షం, హీరో హీరోయిన్స్ ఫోజు చూస్తే... సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చే యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది.
Also Read: నయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?

'మారియో' చిత్రానికి కళ్యాణ్ జీ గోగణ దర్శకుడు. 'నాటకం', 'తీస్ మార్ ఖాన్' వంటి డిఫరెంట్ సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ స్టైలిష్ రొమాంటిక్ ఫిల్మ్ అని ఆయన చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలు.
Also Read: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!
View this post on Instagram
అనిరుద్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న 'మారియో'లో రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీత దర్శకులు. స్వరాలు అందించడంతో పాటు పాటలు, మాటలు రాస్తున్నారు రాకేందు మౌళి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎంఎన్ రెడ్డి, కూర్పు: మణికాంత్ - మదీ మన్నెపల్లి, నిర్మాణ సంస్థలు: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ - రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కథ - దర్శకత్వం : కళ్యాణ్ జీ గోగణ.





















