'కుమారి 21 ఎఫ్' సినిమాతో హీరోయిన్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది హెబ్బాపటేల్. దీంతో ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. నిఖిల్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో ఆడిపాడింది. కానీ ఎక్కువరోజులు తన సక్సెస్ ను ట్రాక్ ను కంటిన్యూ చేయలేకపోయింది. అవకాశాలు తగ్గడంతో చిన్న చిన్న రోల్స్, ఐటెం సాంగ్స్ లో నటించడం మొదలుపెట్టింది. మధ్యలో 'ఆహా'లో వచ్చిన 'మస్తీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. కానీ ఈ సిరీస్ కూడా ఆమెకి పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ఆమె 'ఓదెల రైల్వే స్టేషన్' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె డీగ్లామరస్ రోల్ లో కనిపించనుంది సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది.