దివి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బ్యూటీ తన అందంతో యూత్ ని ఆకట్టుకుంది. హౌస్ లో కొద్దిరోజులు ఉన్నప్పటికీ తన గేమ్ తీరుతో అందరినీ ఆకట్టుకుంది. కొన్ని కారణాల వలన ఆమె కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత దివికి ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఓ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు ఒప్పుకుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.