మే 7 శనివారం రాశిఫలాలు: ఈ రాశులవారికి శని యోగకారకుడు
మేషం ఈ రోజు ఇంటి అవసరాలు తీర్చడంపై శ్రద్ధ వహిస్తారు.ప్రయాణం సమయంలో వాహనం ఇబ్బంది పెడుతుంది. మాట్లాడేటప్పుడు పరుష పదాలు వినియోగించవద్దు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. లావాదేవీల విషయంలో జాగ్రత్త.
వృషభం వ్యక్తిగత పనులు చాలావరకూ పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల మాటలను శ్రద్ధగా వినండి. చాలామంది మీతో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తారు. సామాజిక సేవలో మీ కార్యాచరణ పెరుగుతుంది. కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు అందుతాయి.
మిథునం వివాహితులు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపార ప్రణాళిక రూపొందిస్తారు. పెట్టుబడులకు అనుకూల సమయం. డబ్బు లావాదేవీల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అధిక శ్రమ అలసటకు కారణమవుతుంది.
కర్కాటకం విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. రచనా రంగంలో ఉన్నవారు ప్రశంసలు అందుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర చర్చలు జరపవద్దు.
సింహం ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కోపం తగ్గించుకోండి లేదంటే కొన్ని పనుల్లో నష్టపోతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆశించవద్దు. వ్యవాహారాల్లో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.
కన్య ఈ రోజు మీకు మంచి రోజు. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఊహించిన దానికన్నా ఉత్తమ ఫలితాలు పొందుతారు. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీరు సమాజంలో గౌరవం పొందుతారు.మీ మీ రంగాల్లో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
తులా ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. అవసరమైన పనులను పూర్తి చేయగలరు. రావాల్సిన మొత్తం చేతికందుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులపై చాలా ఒత్తిడి ఉంటుంది. మీరు పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ పొందవచ్చు.
వృశ్చికం ఈ రోజు విచారకరమైన వార్త వింటారు.వివాదాలకు దూరంగా ఉండండి. తెలిసిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయవచ్చు. పోటీ పరీక్షల్లో మీరు గొప్ప ఫలితాలు పొందుతారు. మీలో అంతర్గత శక్తి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.
ధనుస్సు వ్యాపార భాగస్వాములతో వివాదాలుంటాయి. అతి విశ్వాసం కారణంగా మీ పని ప్రభావితం అవుతుంది. అందర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. అదృష్టం కలిసొస్తుంది. ఇతరులను విమర్శిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి.
మకరం ఆదాయం పెరుగుతుంది. సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించండి...అనవసర వాదనలకు దిగొద్దు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. భక్తిభావం పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి.ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు తిరిగి ప్రారంభించండి.
కుంభం మీ పనిపై శ్రద్ధ వహించండి. తప్పుడు వ్యక్తులకు మద్దతివ్వకండి. కుటుంబంతో సమయం గడుపుతారు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మీనం మీ జీవిత భాగస్వామి పట్ల అభిమానం పెరుగుతుంది. ఇంటి వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. కొంతమంది మీ పట్ల చాలా ఆకర్షితులవుతారు. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.