వాస్తు ప్రకారం తాబేలు బొమ్మ ఇంట్లోఉంటే ఏం జరుగుతుంది



చైనా వాస్తు అని పిలిచే ఫెంగ్‌షుయ్ పద్ధతిలో తాబేలు ఎలా తన ఐదు అవయవాలను (తల, నాలుగుకాళ్లను) ఎలా లోనికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో.. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంటే ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా రక్షిస్తుందని చెబుతారు.



లోహంతో తయారు చేసిన తాబేలును నీటితో నింపిన పాత్రలో ఉంచి ఇంట్లో ఉత్తర దిశలో కానీ ఉత్తరం వైపున్న బెడ్ రూమ్ లో కానీ ఉంచాలి.ఇలా చేయడం వల్ల మీకు శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.దిష్టి కూడా తొలగిపోతుంది.



తాబేలుని తూర్పు దిశలో ఉంచితే అశాంతి, సమస్యలు తలొగిపోతాయి



బొమ్మ తాబేలు మాత్రమే కాదు బతికున్న తాబేలుని తీసుకొచ్చి అక్వేరియంలో పెట్టొచ్చు



స్పటికంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచితే సంతోషం వెల్లివిరుస్తుంది



హిందూ పురాణాల ప్రకారం.. తాబేలును శ్రీ మహావిష్ణువు కుర్మావతారంగా భావిస్తారు. ఈ అవతారంలో వచ్చిన మహావిష్ణువు ఎన్నో అద్భుతాలు చేశారని చాలా మంది నమ్ముతారు.వాస్తురీత్యా ఉత్తర దిక్కు బుధుడికి చెందినది. ఉత్తరం కుబేర స్థానంగా భావిస్తారు.



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడికి అదిదేవుడు విష్ణువు. తాబేలుని నీటిలో ఉంచి ఉత్తర దిక్కువైపు ఉంచడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి



తాబేలు ఉన్న ఇంట్లో ఉంటే పిల్లల్లో జ్ఞానసంపద పెరుగుతుందని విశ్వసిస్తారు



ముఖ్యంగా ఇంట్లో వాస్తుదోషాలేమైనా ఉంటే వాటికి తాబేలు ఉపశమనం లభిస్తుంది.



ఆర్థిక సమస్యలు పరిష్కారం అవడమే కాదు..డబ్బుకి లోటుందు



షాపులో తాబేలు ఉంచితే వ్యాపారం వృద్ధి చెందుతుంది..