అన్వేషించండి

Mansoor Ali Khan - Trisha: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మన్సూర్ అలీ ఖాన్ - త్రిష స్పందన ఇదీ

Trisha: కోలీవుడ్‌లో తాను చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపడంతో వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని మన్సూర్ నిర్ణయించుకున్నాడు. అందుకే త్రిషకు సారీ చెప్పాడు. త్రిష కూడా తన సారీకి స్పందించింది.

Mansoor Ali Khan : ప్రస్తుతం కోలీవుడ్‌లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న విషయం ఏంటో చాలామందికి తెలిసింది. తన సహనటి, సీనియర్ హీరోయిన్ అయిన త్రిషపై సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ అసభ్యకరంగా ఉండడంతో దానిని ఖండిస్తూ ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఆయన ఆ కామెంట్స్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యి.. త్రిష సైతం వాటికి రియాక్ట్ అయ్యింది. అంత జరిగినా తాను సారీ చెప్పనని, తాను అన్న మాటల్లో తప్పు లేదు అన్న మన్సూర్.. తాజాగా త్రిషకు క్షమాపణలు చెప్పాడు. బాగా ఆలోచించిన తర్వాత త్రిష కూడా.. మన్సూర్ సారీకి రియాక్ట్ అయ్యింది.

విచారణ తర్వాత..
‘‘నా సహ నటి త్రిషకు సారీ’’ అంటూ తాజాగా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు మన్సూర్ అలీ ఖాన్. ఇక మన్సూర్ చెప్పిన సారీకి ట్విటర్ ద్వారా రియాక్ట్ అయ్యింది త్రిష. ‘‘తప్పులు చేయడం మానవ సహజం. క్షమించడం దైవత్వం’’ అంటూ పోస్ట్ షేర్ చేసింది ఈ సీనియర్ హీరోయిన్. ఇటీవల త్రిషపై చేసిన కామెంట్స్ వల్ల మన్సూర్ అలీ ఖాన్‌పై 354ఏ (లైంగిక వేధింపులు), సెక్షన్ 509 (మహిళలను కించపరచడం) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసం పోలీసుల ముందు హాజరయ్యాడు మన్సూర్. ఆ మరుసటి రోజే త్రిషకు సారీ చెప్పి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి త్రిష ‘‘తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవత్వం’’ అని సమాధానం ఇచ్చింది.

త్రిష వర్సెస్ మన్సూర్..
ఇటీవల లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘లియో’ చిత్రంలో త్రిషతో పాటు మన్సూర్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించాడు. అయితే తను నటించిన ఇంతకు ముందు సినిమాల్లోలాగా హీరోయిన్‌ను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి రేప్ చేసే సీన్ ఉంటుందేమో అని ఆశించానని కానీ షూటింగ్ జరుగుతున్నంత కాలం కనీసం తనకు త్రిషను చూపించలేదని ఒక ఈవెంట్‌లో మన్సూర్ అలీ ఖాన్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. త్రిష సైతం ఈ కామెంట్స్‌కు వెంటనే రియాక్ట్ అయ్యింది. ఈ కామెంట్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఇలాంటి కామెంట్స్‌ను తాను ఖండిస్తున్నానంటూ, ఇక జీవితంలో మన్సూర్ అలీ ఖాన్‌తో కలిసి నటించడం కుదరదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

సింపుల్‌గా ఒక్క పోస్ట్‌తో..
త్రిష ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై రియాక్ట్ అవ్వడానికి మన్సూర్ అలీ ఖాన్.. ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. తను మామూలుగా అన్న మాటల వల్ల కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని, తనంటే ఇష్టం లేని వాళ్లు కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించాడు. అంతే కాకుండా ఈ విషయంలో సారీ చెప్పడం కుదరదు అంటూ అందరి ముందు ప్రకటించాడు. కానీ పోలీస్ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత మన్సూర్ మనసు మారిపోయినట్టుంది. అందుకే త్రిషకు సారీ చెప్పి ఈ వివాదాన్ని ముగించాలని అనుకున్నాడు. త్రిష కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఇన్‌డైరెక్ట్‌గా మన్సూర్‌ను క్షమిస్తున్నట్టు పోస్ట్ పెట్టి ఈ వివాదాన్ని ముగించింది. మరి ఇప్పటికైనా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు ఆగుతాయేమో చూడాలి.

Also Read: 'కాంతార' కొత్త చాప్టర్ ఫస్ట్ లుక్ - ఈసారి కాంతి కాదు, దర్శనమే! అంచనాలు పెంచిన రిషబ్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget