అన్వేషించండి

Anshu Reacts on Surgery Rumours : మన్మథుడు హీరోయిన్ అన్షూపై సర్జరీ రూమర్స్.. ఘాటైన రిప్లై ఇచ్చిన భామ

Actress Anshu : మన్మథుడు ఫేమ్ అన్షూపై నెటిజన్లు సర్జరీ రూమర్స్ క్రియేట్ చేశారు. వారికి సోషల్ మీడియా వేదికగా ఘాటైనా రిప్లై ఇవ్వడంతో పాటు, ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది ఈ భామ. 

Actress Anshu Reaction on Surgery Rumors : హీరోయిన్ అన్షూ అంటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ.. మన్మథుడు సినిమాలో నాగార్జున సరసన చేసిన హీరోయిన్ అంటే చాలామంది గుర్తుపడతారు. ఈ భామ తెలుగులో మన్మథుడు, ప్రభాస్​తో రాఘవేంద్ర, మిస్సమ్మలో చిన్నపాత్ర చేసి ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తెలుగులో మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇన్​స్టాగ్రామ్​లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

అవకాశాల కోసం సర్జరీలు!?

అన్షూ ఇన్​స్టాగ్రామ్ (actressanshuofficial)లో ఫోటోషూట్స్ షేర్ చేసిన సమయంలో చాలామంది మీరు ఇంకా మారలేదండి.. ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీకు ఏజ్ అవ్వట్లేదు అంటూ పలు కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు ఆమె సర్జరీ చేయించుకుందని.. సినిమాల్లో అవకాశాల కోసం బికినీలు వేస్తోందంటూ నెగిటివ్​ కామెంట్లు చేస్తున్నారు. ఇక వాటికి ఫుల్​స్టాప్​ పెట్టాలనే ఉద్దేశంతో అన్షూ ఇన్​స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. 

మీ పని మీరు చూసుకోండి

మీరు ఖాళీగా ఉంటే వేరే హాబీలు వెతుక్కోండి కానీ.. ఇలా కామెంట్లు చేయవద్దంటూ పెద్ద పోస్ట్ రాసుకొచ్చింది. '' Gosh Please find a hobby some of you comment like these are such a bad reflection of you and only you! And for the record I have wrinkles and zero surgery/fillers. Embraced the cute chubby face most of my life and now embracing some chizzle, hope thats okay? Oh and for the record to EVERYONE- its NEVER too late, for anything- keep dreaming and follow whatever path fives you happiness'' అంటూ రాసుకొచ్చి.. తన ముఖంపై ఉన్న ముడతలు, ఫిల్లర్స్ లేవని చూపిస్తూ వీడియో చేసింది అన్షూ. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anshu (@actressanshuofficial)

మద్ధతు ఇస్తోన్న ఫ్యాన్స్..

ఈమె పోస్ట్​కి ఆమె అభిమానులు, కొందరు నెటిజన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. You are and always have been stunning! Having known you most of your life really I've seen how you've grown, bloomed and embraced every era of YOU. Each one fabulous but this is your most fiery & I'm loving watching you rise 🔥 YOU do YOU 🤍 అంటూ సపోర్ట్ ఇస్తున్నారు. 

ఇండస్ట్రీలో సర్జరీలు..!

నటీ, నటులు తమ లుక్స్​ కోసం, స్క్రీన్​పై మంచిగా కనిపించడం కోసం కొన్ని సందర్భాల్లో సర్జరీలు చేయించుకుంటారు. కొందరు నటులు వాటిని బహిరంగంగా చెప్తారు. కొందరు చెప్పరు. అలా అని అందరూ సర్జరీలు చేయించుకుంటారా అంటే కాదు కదా. కానీ కొందరు నెగిటివ్ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో లేదా డేటా ఎక్కువగా ఉండి ఏమి చేయాలో తెలియక ఇలాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే వారు సర్జరీలు చేయించుకున్నా.. చేయించుకోకపోయినా వారు వారి పనుల్లో బిజీగానే ఉంటారు. మనం వారి నిర్ణయాన్ని గౌరవించి వదిలేయాలి అంతే. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
The Paradise Teaser : నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
The Taj Story OTT : మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
Embed widget