30ల్లో మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే వయసు పెరిగే కొద్ది వృద్ధాప్య ఛాయలు పెరుగుతాయి. అయితే వాటిని కంట్రోల్ చేసేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. అలాంటి వాటిలో ఫుడ్ కూడా ఒకటి. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే వయసైనా యంగ్‌గా కనిపిస్తారట. మీ డైట్లో కచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇది కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా ఎమినో యాసిడ్స్, కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తుంది. రెడ్ మీట్లో విటమిన్ ఏ సోర్స్ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. నెయ్యి, బటర్, కొబ్బరినూనె వంటి హెల్తీ ఫ్యాట్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి యవ్వనంగా ఉంచుతాయి. కొల్లాజెన్‌ను అందించే ఫుడ్స్ తీసుకోవాలి. గుడ్లు, వెజిటెబుల్స్‌ను మీ డైట్లో చేర్చుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన బెర్రీలు, పసుపు వంటివి తీసుకుంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహాలు ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)