Urfi Javed on Lip Fillers : బెడిసి కొట్టిన లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఉర్ఫీ జావేద్ ఫేస్, కారణమిదే
Urfi Javed : ఉర్ఫీ జావేద్ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. దానికి రీజన్ ఆమె లిఫ్ ఫిల్లింగ్ చేయించుకోవడమే.

Urfi Javed Lip Fillers Video : ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా వినియోగించేవారికి, స్టైల్స్, ఫ్యాషన్ గురించి ఫాలో అయ్యేవారికి ఆమె బాగా తెలుసు. వివిధ రకాల స్టైల్ స్టేట్‌మెంట్‌లు, ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉర్ఫీ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజాగా కూడా ఓ వీడియోతో వార్తల్లో నిలించింది. పెదాలకు లిప్ ఫిల్లింగ్ చేయిస్తూ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఎక్స్‌పీరియన్స్‌ను చెప్పింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆమె ముఖం అంత వాచిపోవడానికి కారణం ఏంటి?
ఉర్ఫీ జావేద్ తన ఫ్యాషన్ లుక్స్‌తో కొన్నిసార్లు ట్రోలింగ్స్‌కు, మరికొన్నిసార్లు ప్రశంసలను అందుకుంటుంది. ట్రోలింగ్‌ని పక్కన పెట్టి వివిధ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో అందరినీ ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా బహిరంగంగా చెప్పడానికి వెనకాడదు. దీనిలో భాగంగానే ఉర్ఫీ తన లిప్ ఫిల్లింగ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ వీడియోను షేర్ చేసి.. లిప్ ఫిల్లింగ్ ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్తూ.. పలు షాకింగ్ విషయాలు తెలిపింది.
బెడిసి కొట్టిన లిప్ ఫిల్లింగ్
ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె 18 ఏళ్ల వయసులో లిప్ ఫిల్లింగ్ చేయించుకున్నానని.. ఆ తర్వాత శస్త్రచికిత్స ద్వారా తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చానని చెప్పింది. వీడియో పోస్ట్ చేసినప్పుడు.. ఇలా రాసుకొచ్చింది. 'No this is not a filter, I decided to get my fillers dissolved as they were every misplaced. I will get them again but naturally. Im not saying no to fillers at all. Dissolving is painful. Also its very very important you got to a good doctor for fillers, all these doctors with fancy clinics know nothing' అంటూ పోస్ట్ కింద రాసుకొచ్చింది.
View this post on Instagram
లిప్ ఫిల్లింగ్ చేయించుకున్న తర్వాత మళ్లీ సాధారణ స్థితికి రావాల్సి వచ్చిందని.. ఎందుకంటే రిజల్ట్ వాళ్లకి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చినట్లు వీడియో తెలిపింది. నేను లిప్ ఫిల్లింగ్ వద్దని చెప్పట్లేదు. కానీ సరైన పద్ధతిలో చేయించుకోవడం చాలా ముఖ్యం. ఫ్యాన్సీ క్లినిక్స్ ఎక్కువ అయిపోయాయి. వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియదు. కాబట్టి సరైన వారిని ఎంచుకుని వెళ్లాలి అంటూ.. క్యాప్షన్ ఇచ్చింది. ఉర్ఫీ ఫిల్లింగ్ తొలగించే వీడియోను జోడించింది. ఈ వీడియోలో ఆమె కళ్లు ఎర్రగా మారడంతో పాటు.. ముఖం, పెదాలు పూర్తిగా ఉబ్బిపోయాయి. రాబోయే రోజుల్లో ఉర్ఫీ ఫిల్లింగ్ లేకుండా కనిపించనుంది.






















