King 100 : తమిళ దర్శకుడితో కింగ్100... ఈసారి విలన్ కాదు, హీరో - కన్ఫర్మ్ చేసిన నాగార్జున
Nagarjuna 100th Movie : కింగ్ నాగార్జున తన 100వ మూవీని గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఓ టాక్‌షోలో ఇచ్చేశాడు నాగ్‌మామ.

Nagarjuna King 100 : నాగార్జున తన 100వ సినిమాపై హైప్ పెంచేశారు. తాజాగా జగపతిబాబుతో చేసిన టాక్ షోలో 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌ను రివీల్ చేశాడు నాగ్. జయమ్మూ నిశ్చయమ్మూరా అనే టాక్ షోకి మొదటి గెస్ట్‌గా వచ్చిన నాగార్జున తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిపారు. దానిలో భాగంగా 'కింగ్ 100' అప్డేట్ కూడా ఇచ్చేశారు.
నాగ్ లీక్స్..
జగపతిబాబు కింగ్100 గురించి అడగ్గా.. ''కింగ్ 100 ఒక ఆరు, ఏడు నెలల నుంచి వండుతున్నారు. కార్తీక్ అని ఒక తమిళ డైరక్టర్. ఇప్పటికే ఒక సినిమా చేశాడు. నాకు ఏడాది క్రితం కథ చెప్పాడు. అది కూడా గ్రాండ్ ఫిల్మ్. కూలీ రిలీజ్ అయిపోయింది కాబట్టి నెక్ట్స్ అదే స్టార్ట్ చేయాలి. My Next Release is will be KING అండి'' అంటూ తెలిపారు నాగార్జున. ''నైస్ యాక్షన్, ఫ్యామిలీ, డ్రామా అన్ని Everthing. దాంట్లో నేనే Protagonist'' అంటూ నవ్వుతూ హైప్ పెంచేశారు నాగార్జున.
కొత్త డైరక్టర్‌తో..
ఈ సినిమా గురించిన చర్చ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డైరక్టర్ RA కార్తీక్.. కింగ్ 100 చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే ఈ యువదర్శకుడు కేవలం ఒక్క సినిమానే చేశాడు.'నిథం ఓరు వానం' తెలుగులో 'ఆకాశం' పేరుతో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ని అందుకుంది. ఈ యువ డైరక్టర్‌పై కింగ్ తన 100 మూవీ బాధ్యత పెట్టాడంటే కచ్చితంగా హిట్ కొట్టే అవకాశం ఉందంటున్నారు నెటిజన్స్.
#King100
— shiva (@shivshankar68) August 19, 2025
The film is set to be directed by Ra Karthik, a promising Tamil filmmaker known for Nitham Oru Vaanam (dubbed Aakasam in telugu) @Rakarthik_dir anna yem chestavu telidu kani king100 matram akkineni fans ki life long Gurtu undi povali 🔥🔥#Nagarjuna100 #Nagarjuna pic.twitter.com/hTDx40Euws
రిమేక్ కథనా?
కింగ్ 100 స్టోరీ రిమేక్ అనే చర్చ కూడా నడుస్తోంది. తమిళ్లో R. మంతిరా మూర్తి డైరక్ట్ చేసిన, శశికుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'ఆయోతి'ని రీమేక్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కింగ్‌తో కార్తీక్ ఈ మూవీనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే కథను కార్తీక్ నాగ్‌కి వినిపించాడా? దీనిపైనే వర్క్ చేస్తున్నాడా? అనే విషయాలపై అఫీషయల్గా ఎలాంటి ప్రకటన రాలేదు.
రూట్ మార్చిన నాగ్ మామ..
వయసు పెరిగే కొద్ది నాగార్జున తనని తాను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసుకుంటున్నాడు. ఓ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తే.. మరో సినిమాలో విలన్‌గా చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు. కుబేరా, కూలీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే కింగ్ 100కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు కింగ్ 100తో నాగార్జున మాస్ హిట్ కొడతాడా? లేక రీమేక్‌తోనే సేఫ్ గేమ్ ఆడతాడా వేచి చూడాల్సిందే.






















