Suriya Mollywood Debut : ఆవేశం దర్శకుడితో సూర్య మలయాళ సినిమా... మరోసారి ఖాకి చొక్కాలో!
Suriya Mollywood Debut : 'ఆవేశం’వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడుతో హీరో సూర్య మలయాళం ఇండస్ట్రీలోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'సూర్య 47’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.

Suriya Mollywood Debut Movie Latest Update : 'సింగం' సిరీస్ తర్వాత హీరో సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈసారి కోలివుడ్ నుంచి కాకుండా మలయాళం నుంచి అలరించబోతున్నాడు. ముందుగా అందరూ అనుకున్నట్లు డైరక్టర్, నటుడు బాసిల్ జోసఫ్ దర్శకత్వంలో కాకుండా.. ఫాహాద్ ఫాసిల్ నటించిన 'ఆవేశం' డైరక్టర్ జితు మాధవన్‌తో ఈ సినిమా చేస్తున్నాడు. 'సూర్య 47’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
తన నటనతో కోలివుడ్, టాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు సూర్య. ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాపు. కరుప్పు త్వరలోనే విడుదుల కానుండగా.. తెలుగులో వెంకీ అట్లూరితో చేస్తోన్న సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇదే జోష్‌లో మలయాళంలోకి కూడా వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. రోమాంచమ్, ఆవేశం వంటి సినిమాలు డైరక్ట్ చేసిన జీతూ మాధవన్ స్టోరీకి ఓకే చెప్పాడు. 2D ఎంటర్టైన్మెంట్ దీనిని ప్రొడ్యూస్ చేస్తుంది.
#Suriya47 shooting to begin from this year end. Pre production on full swing 🔥
— AmuthaBharathi (@CinemaWithAB) August 18, 2025
It is said that #Suriya will be doing the Cop role in the film🌟🌟🌟
Directed by Aavesham fame Jithu Madhavan & Produced by 2D Entertainment🎬 pic.twitter.com/OyFpTP8H9T
మరోసారి పోలీస్ రోల్?
సూర్య47లో సూర్య పోలీస్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. మరి ఈసారి సూర్య పాత్ర సింగం సిరీస్‌లా సీరియస్‌గా ఉంటుందా? లేక జితు మాధవన్ ప్రత్యేక శైలిలో ఎంటర్టైనింగ్‌గా రూపుదిద్దుకుంటుందా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య 47కి సంబంధించిన ప్రీ ప్రొడెక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. 2025 చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2026లో సినిమా విడుదల కావొచ్చు.
సూర్య లైనప్
ప్రస్తుతం మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన కరుప్పు సినిమాతో సూర్య కొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానున్నారు. సూర్య 46తో వెంకీ అట్లూరీ తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు సూర్య 47తో పోలీస్ పాత్రతో.. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ బిజీగా ఉన్నాడు సూర్య. అయితే సూర్య 48 బాలీవుడ్ సినిమా అయ్యే అవకాశముందని పలు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఆకాశమే హద్దురా, జైభీమ్ తర్వాత సూర్యకు మంచి హిట్ దొరకలేదు. కంగువా నిరాశనే మిగల్చగా.. రెట్రో కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈసారి జితు మాధవన్‌తో కలిసి మలయాళంలో అడుగుపెడుతున్న సూర్య తప్పనిసరిగా ఒక పెద్ద హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : సూర్య ఫిట్నెస్ సీక్రెట్స్.. బెస్ట్ ఫిజిక్కోసం సూర్య ఏమి చేసేవాడో తెలుసా?






















