Kanguva Director Shiva Interview : సూర్య ఫిట్నెస్ కంగువకు బ్లెస్సింగ్.. సీక్వెల్‌కు లీడ్ ఇచ్చే పాత్రలో చేసింది ఎవరంటే - డైరక్టర్ శివ ఇంటర్వ్యూ
Kanguva : కంగువ సినిమా కోసం సూర్య ఎంతో కష్టపడ్డారని.. ఆయన ఫిట్నెస్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయిందని డైరక్టర్ శివ తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
Director Siva On Kanguva Movie : హీరో సూర్య (Hero Suriya) నటించిన కంగువ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ మూవీ డైరక్టర్ శివ ఈ సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కించారు. నవంబర్ 14వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లు చేస్తూ.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. తాజాగా దర్శకుడు శివ.. కంగువ సినిమా గురించి.. అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన విషయాలు ఆయన తెలిపారు.
కంగువ స్క్రిప్ట్‌ను జ్ఞానవేల్ గారే సెలక్ట్ చేశారు. సూర్యకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. అక్కడే నేను సగం సక్సెస్ సాధించాను. అయితే మూవీని చెప్పడం సులభమే. కానీ తెరకెక్కించడమే కష్టం. అలాంటిది ఈ సినిమాను ఇంత బాగా తెరకిక్కంచడంలో సూర్య, నా డైరక్షన్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. కంగువ సినిమా కోసం రెండున్నరేళ్లుగా వర్క్ చేశాము. ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్నాము. ఈ సినిమాను త్రీడిలో చూసినప్పుడు మా కష్టం తెలుస్తుంది.
సూర్య సపోర్ట్..
షూటింగ్ సమయంలో సూర్య తన పూర్తి సపోర్ట్ ఇచ్చారు. ఉదయం నాలుగు గంటలకే సూర్యగారు మేకప్‌కి రెడీ అయ్యేవారు. అలా షూటింగ్‌కు ప్రిపేర్ అయితే.. 7 గంటలకు ఫస్ట్ షాట్ తీసేవాళ్లం. మేకప్ సమయంలో సూర్య చాలా ఓపికగా ఉండేవారు. సినిమాను ఎక్కువ కొండల ప్రాంతంలో చేశాము. సూర్య టీమ్‌తో పాటే నడుచుకుంటూ.. హిల్ క్లైంబింగ్ చేసేవారు. కంగువ సినిమాకు సూర్య ఫిట్నెస్ ఓ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. 50 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ చేయడం మామూలు విషయం కాదు. కానీ సూర్య డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. బాగా వర్క్అవుట్స్ చేసేవారు.
డ్యూయల్ రోల్..
కంగువలో సూర్య రెండు పాత్రల్లో కనిపిస్తారు. కంగువగా వెయ్యేళ్ల కిందటి వీరుడిగా కనిపిస్తారు. ఈ ఫ్రాన్సిస్ మోడ్రన్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఈ రెండు క్యారెక్టర్లో సూర్య అద్భుతమైన నటనను కనబరిచారు. బాబీడియోల్ తన స్క్రీన్ ప్రెజన్స్‌తో కంగువకు కొత్త ఎనర్జీని తీసుకొచ్చారు. ఆయన కెరీర్లో ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అవుతుంది. దిశా క్యారెక్టర్లో కూడా అనేక షేడ్స్ ఉంటాయి. ఫ్రాన్సిస్‌కి జోడిగా ఏంజిలినాగా దిశా కనిపిస్తుంది.
అతిథి పాత్రలో అతనేనా?
కంగువలో సర్ప్రైజింగ్ అతిథి పాత్ర ఉంటుందని.. ఇదే కంగువ సీక్వెల్‌కు లీడ్ ఇస్తుందని శివ తెలిపారు. అయితే ఇప్పటికే సూర్య ఇచ్చిన హింట్స్ ప్రకారం.. ఈ క్యారెక్టర్‌ను కార్తీ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్యారెక్టర్ స్క్రీన్‌పై మంచి ఇంపాక్ట్ ఇస్తుందంటూ శివ వెల్లడించారు. అయితే ఈ క్యారెక్టర్ తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతారని శివ తెలిపారు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందన్నారు. క్రియేటివ్‌గా, కమర్షియల్‌గా కూడా కంగువ ఆకట్టుకుంటదని ధీమా వ్యక్తం చేశారు.