By: ABP Desam | Updated at : 12 Aug 2023 03:21 PM (IST)
'మంగళవారం' సినిమాలో మొదటి పాట విడుదలకు వేళాయరా
'ఆర్ఎక్స్ 100' (RX 100 Movie) తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా ప్రేమ కథలు, రొమాంటిక్ గీతాలను చూపించే విధానంలో మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. ఆ సినిమా తీసిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మంగళవారం' (Mangalavaram Movie). ఇందులో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా మరికొందరు తారలు ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సినిమాలో మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నారు.
'మంగళవారం'లో గణగణ మోగాలిరా...
Ganagana Mogalira Song : 'మంగళవారం' సినిమాలో మొదటి పాట మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 16... అనగా వచ్చే బుధవారం 'గణగణ మోగాలిరా' సాంగ్ విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది.
Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
'మంగళవారం' చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?
చిత్ర నిర్మాతలలో ఒకరైన స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ ''జూన్ 12న షూటింగ్ కంప్లీట్ చేశాం. మొత్తం 99 రోజులు పట్టింది. అందులో కేవలం 48 రోజులు పగటి పూట, 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి సినిమా తీస్తున్నారు'' అన్నారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుందని సంతోషం వ్యక్తం చేశారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా పాయల్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో పాయల్ కళ్ళలో కన్నీటి పోర కూడా ఉంటుంది. ఎమోషనల్ బోల్డ్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
'మంగళవారం' రేర్ విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో సినిమా తీస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. సినిమాలో ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. మొత్తం 30 క్యారెక్టర్లు ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో స్టార్ట్ చేస్తాం. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం హైలైట్స్‌లో ఒకటి అవుతుంది'' అని అన్నారు.
మంగళవారం చిత్రానికి కూర్పు : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, కళ : మోహన్ తాళ్లూరి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి, పోరాటాలు : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైన్ & ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, నృత్యాలు : భాను, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>