అన్వేషించండి

Kannappa OTT: గెట్ రెడీ.. మూవీ రిలీజ్ అయ్యాక వస్తా! - 'కన్నప్ప' ఓటీటీపై మంచు విష్ణు క్లారిటీ

Manchu Vishnu: తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఓటీటీ డీల్‌పై మంచు విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుంది?, ఎన్ని రోజుల తర్వాత వస్తుందనే దానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Manchu Vishnu About Kannappa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ ప్రమోషన్లలో మంచు విష్ణు పాల్గొంటున్నారు. శనివారం గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుక సైతం ఘనంగా నిర్వహించారు. 

ఓటీటీ రిలీజ్‌పై రూమర్స్.. విష్ణు క్లారిటీ

ఈ మూవీని ఓటీటీలకు ఇవ్వనని చాలా రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు మంచు విష్ణు. అయితే.. 'కన్నప్ప' ఓటీటీపై అటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. పలు రూమర్స్ హల్చల్ చేశాయి. వీటన్నింటిపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు విష్ణు. 'కన్నప్ప ఓటీటీ డీల్ కుదిరిందా?' అని ప్రశ్నించగా.. ఓ పెద్ద ఓటీటీ సంస్థ వద్దకు వెళ్లానని.. అయితే వారు చెప్పిన ఫిగర్ తనకు నచ్చలేదని చెప్పారు. 'ఓటీటీ డీల్ కోసం ఓ సంస్థ వద్దకు వెళ్లి చాలా పెద్ద నెంబర్ అడిగాను.  వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు. అది నాకు నచ్చలేదు.

మూవీ హిట్ అయిన తర్వాత అమ్మితే ఎంత ఇస్తారని వారిని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు చాలా నచ్చింది. చెక్ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పాను. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను. నేను పెట్టిన బడ్జెట్ నాకు థియేట్రికల్ రన్‌లోనే వస్తుందనే నమ్మకం నాకు ఉంది.' అని క్లారిటీ ఇచ్చాారు విష్ణు.

8 వారాల తర్వాతే..

సినిమా రిజల్ట్ ప్రకారం ఓటీటీ డీల్ ఇచ్చినట్లు మంచు విష్ణు చెప్పగా.. 'ఏ సంస్థకు ఇచ్చారు?' అనే ప్రశ్న ఎదురైంది. 'అది వాళ్లే చెప్పాలని.. అయితే.. థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే మూవీ ఓటీటీలోకి వస్తుంది.' అని స్పష్టం చేశారు. ఈ మూవీ బడ్జెట్ కూడా అంచనాలకు మించి ఖర్చైందని.. వీఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ ఖర్చు చేసినట్లు చెప్పారు. తాను పెట్టిన బడ్జెట్ స్క్రీన్‌పై కనిపిస్తుందన్నారు.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలకు ఒక్క శాతం ఎక్కువే ఉంటుంది - హైప్ పెంచేస్తోన్న రాజా సాబ్ డైరెక్టర్ మారుతి

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు మంచు విష్ణు, మోహన్ బాబు, బ్రహ్మానందం, శివబాలాజీ, ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు. 'కన్నప్ప' చిత్రాన్ని ఆడియన్స్ అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు మోహన్ బాబు. 'ఈ సినిమా కోసం మంచు విష్ణు ఆరేడేళ్లు కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకొచ్చాను. తప్పు చేయనప్పుడు ఎవరకీ భయపడాల్సిన పని లేదు.

ప్రభాస్ మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే అంగీకరించారు. ప్రభాస్, నేను బావ బావ అని సరదాగా పిలుచుకుంటాం. ఆయన వందేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. కన్నప్ప సినిమాని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు.' అని అన్నారు.

మోహన్ బాబు కాళ్లు మొక్కిన బ్రహ్మానందం

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. స్టేజీపై బ్రహ్మానందం మాట్లాడేటప్పుడు మోహన్ బాబు ఏదో అంటుండగా.. తాను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దంటూ బ్రహ్మానందం చెప్పారు. దీంతో మోహన్ బాబు ఆయనకు చేతులెత్తి దండం పెట్టారు. ఆ తర్వాత మోహన్ బాబు స్టేజీపై మాట్లాడుతూ.. బ్రహ్మానందంపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఆయన కాళ్లు పట్టుకున్నారు బ్రహ్మానందం. ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget