అన్వేషించండి

Manchu Vishnu: మోహన్ బాబుకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు, ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటుడు మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన బాటలో తన ఇద్దరి కొడుకులు..

Manchu Vishnu: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటుడు మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన బాటలో తన ఇద్దరి కొడుకులు విష్ణు, మనోజ్ లు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అయ్యారు. కూతురు మంచు లక్ష్మీ కూడా సినిమాల్లో నటిస్తూ సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ ట్రోలింగ్ కు గురవుతుంది. వారి కుటుంబంలో ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతోంది. మొన్నటి వరకూ మంచు బ్రదర్స్ కు పొసగడంలేదనే వార్తలు వచ్చాయి. అయితే వాటిపై మోహన్ బాబు క్లారిటీ కూడా ఇస్తూ వచ్చారు. ఈ మధ్య మంచు విష్ణు తన సోదరుడు మనోజ్ పై గొడవకు దిగిన వీడియో ఒకటి హల్చల్ చేసింది. అయితే దీనిపై కూడా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మంచు ఫ్యామిలీకు సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇటీవల మార్చి 19 న మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు  అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే మంచు విష్ణు మాత్రం తన తండ్రికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారట. ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీ కారుని విష్ణు బహుమతిగా ఇచ్చాడట. ఈ కారు ఖరీదు దాదాపు రూ.5.25 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఈ కారు గురించి కానీ దాని  ధర గురించి కానీ మంచు ఫ్యామిలీ ఎక్కడా బయటకు చెప్పలేదట. ఇప్పటికే మోహన్ బాబు వద్ద ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చ్యూనర్‌ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్త కారు వచ్చి చేరింది. అయితే ఆయన పుట్టిన రోజు జరిగిన చాలా రోజుల తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. నిజంగా మంచు విష్ణు తన తండ్రికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చారా లేదా ఇదంతా పుకార్లు మాత్రమేనా అనేది తెలియాలి అంటే ఈ వార్తలపై మంచు ఫ్యామిలీ స్పందించాలని అంటున్నారు నెటిజన్స్. 

కాగా, ప్రస్తుతం మోహన్ బాబు కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన రీసెంట్ గా గుణశేఖర్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. ఈ మూవీ తో పాటు ఇటీవల మంచు విష్ణు ప్రకటించిన ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాల్టీ షోను ప్రారంభించాలని చూస్తున్నారు మంచు ఫ్యామిలీ. దీనిపై ఇప్పటికే ఓ అభిప్రాయనికి వచ్చారట. ఇంకో ట్విస్ట్ ఎంటంటే ఇటీవల జరిగిన విష్ణు, మనోజ్ గొడవ కూడా ఈ ‘హౌస్ ఆఫ్ మంచు’లో భాగమేనని అంటున్నారు. మరి ఈ రియాలిటీ షోతో మంచు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి.

Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget