Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మంచు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు ఆయన తనయుడు మనోజ్ మంచు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
Manchu family reacts to Mohan Babu vs Manoj issue: మంచు కుటుంబం అంటే క్రమశిక్షణకు మారుపేరు అని తెలుగు చలన చిత్ర పరిశ్రమంలో ఒక పేరు ఉంది. అటువంటి కుటుంబంలో కలహాలు రావడం ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచింది. లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన రెండో తనయుడు మనోజ్ మంచు మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై మరొకరు కంప్లైంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఎవరు ఎవరిని కొట్టారు? ఇప్పుడు ఇదే ప్రశ్న!
తన తండ్రి మోహన్ బాబు తనమీద చేయి చేసుకున్నారని హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ఇండస్ట్రీలో సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. కొంతమంది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ అంటుంటే మరి కొంతమంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ అని చెబుతున్నారు ఏది ఏమైనా మంచు కుటుంబంలో కొట్లాట మొదలైందని ఇండస్ట్రీలో వర్గాలు ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యానిస్తున్నాయి.
మరోవైపు మనోజే తనమీద దాడి చేశాడని మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గాయాలతో మనోజ్ పోలీస్ స్టేషన్ వెళ్లారని వార్తలు వస్తుండగా వాటిని మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఖండిస్తున్నాయి.
వార్తల్లో నిజం లేదు... ఖండించిన విష్ణు టీమ్, మంచు ఫ్యామిలీ!
మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తల్లో విస్తృతంగా ప్రచారం జరగ్గా... వాటిని మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచుకు చెందిన టీమ్ ఖండించింది. ఆధారాలు లేకుండా ఎటువంటి కథనాలు ప్రచారం చేయవద్దు అని మంచు కుటుంబం పేర్కొంది.
Also Read: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?
''మోహన్ బాబు గారు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ దగ్గర ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా ఛానళ్లు అసత్యాలను ప్రచారాలు చేస్తున్నాయి. వాటిలో నిజం లేదు'' అని విష్ణు మంచు పీఆర్వో వ్యవహారాలు చూసే వ్యక్తి మీడియాకు సమాచారం ఇచ్చారు.
Also Read: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
గతంలో విష్ణు... మనోజ్ మధ్య గొడవ?
మంచు ఫ్యామిలీలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో ఆఫ్ ద రికార్డ్ టాక్. కొన్ని రోజుల క్రితం తన మనుషుల ఇంటికి వచ్చి, తన వాళ్లపై విష్ణు దాడి చేశారని మనోజ్ ఒక వీడియో పోస్ట్ చేశారు. తర్వాత దానిని డిలీట్ చేశారు. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ అంతా కలిసి ఒక షో చేస్తుందని, దాని ప్రచారం కోసం ఆ విధంగా చేశారని వీడియోలు వదిలారు. కట్ చేస్తే మరొక సారి గొడవల కారణంగా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది.