Malavika Mohanan: రజనీ, షారుఖ్, విజయ్... ఫస్ట్ టైమ్ స్టార్స్‌ను చూసినప్పుడు - ABP Southern Rising Summit 2025లో మాళవికా మోహనన్ ఏం చెప్పారంటే?
ABP Southern Rising Summit 2025: చెన్నై వేదికగా జరుగుతున్న 'ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025'లో హీరోయిన్ మాళవికా మోహనన్ పాల్గొన్నారు. తొలిసారి స్టార్ హీరోలను చూసిన క్షణాలను ఆవిడ గుర్తు చేసుకున్నారు.

చెన్నై వేదికగా జరిగిన 'ABP Southern Rising Summit 2025'లో హీరోయిన్ మాళవిక మోహనన్ పాల్గొన్నారు. భారతీయ చిత్రసీమలోని అతిపెద్ద హీరోలతో ఆవిడ సినిమాలు చేశారు. తొలిసారి స్టార్ హీరోలను కలిసిన క్షణాలను ఏబీపీ సమ్మిట్‌లో గుర్తు చేసుకుంటూ పూర్తిగా ఆశ్చర్యపోయారు. 'Working Across Languages: Staying Close to the Roots' సెషన్‌లో మాళవికా మోహనన్ మాట్లాడారు.
ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవిక అనేది తెలిసిన విషయమే. వివిధ భాషలకు చెందిన చిత్రసీమల్లోని సూపర్ స్టార్ హీరోలను కలవడం తనపై ఎలాంటి ముద్ర వేసిందో ఆవిడ పంచుకున్నారు.
మా నాన్నగారు షారూఖ్ ఖాన్ సినిమాలకు పని చేస్తున్న రోజులవి. నా బాల్యంలో జరిగిన సంఘటన ఇది. సినిమా షూటింగ్‌లో జ్ఞాపకాన్ని మాళవిక వివరిస్తూ... ''నా సోదరుడితో పాటు నన్నూ నాన్న షూటింగ్‌కు తీసుకు వెళారు. షారుఖ్ ఖాన్ మమ్మల్ని పలకరించడానికి వచ్చారు. అప్పుడు ఆయన 'మీ కుటుంబ సభ్యులను తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది మోహనన్ అని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది'' అని తెలిపారు. షారుఖ్ ప్రవర్తనకు తాను ఎంతగానో ముగ్ధురాలైపోయానని, కదలలేకపోయానని ఆవిడ వెల్లడించారు.
షారూఖ్ ఖాన్ పలకరించినా మాళవిక లేవలేకపోయిందట. దాంతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆమెను మందలించారట. "అంత పెద్ద మనిషి వచ్చి పలకరిస్తే, నువ్వు కూర్చునే ఉన్నావా" అని పేరెంట్స్ అన్నారు. తాను ఎంతగానో షాక్ అయ్యానని, ఆశ్చర్యపోయానని, అందుకే లేవడం మరిచిపోయానని నవ్వుతూ మాళవిక అంగీకరించింది.
మొదటిసారిగా విజయ్‌ను కలిసినప్పుడు
'మాస్టర్' సినిమాలో దళపతి విజయ్‌తో మళవికా మోహనన్ నటించిన సంగతి తెలిసిందే. మేం సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు దళపతి విజయ్‌తో మీటింగ్ జరిగింది. ఆ క్షణం "వాస్తవికతకు దూరంగా" ఉందని అన్నారావిడ. విజయ్ తెరపై కనిపించే తీరు, బయట... తనకు ఎంతో ఇష్టమన్నారు. ఆయనలో ఒక అయస్కాంత శక్తి, ఆకర్షణను ఉన్నాయన్నారు. అలాగే, రజనీకాంత్‌ను తొలిసారి కలిసిన క్షణాలను సైతం మాళవిక గుర్తుచేసుకున్నారు.
''సూపర్ స్టార్ ఆరా నెక్ట్స్ లెవల్'' అని మాళవికా మోహనన్ వర్ణించారు. ఈ స్టార్లతో కలిసి పని చేయడం ప్రారంభించిన తర్వాత సహజంగానే తన ప్రవర్తనలో చాలా విషయాలు మారాయని, అయితే వారిని కలిసిన తొలి క్షణాలు మాత్రం తనకు ఇప్పటికీ గుర్తు అని, తాను ఓ అభిమానిలా ఉన్నానని ఆమె అన్నారు.
Also Read: భర్తపై కేసు పెట్టిన హీరోయిన్... విడాకుల దిశగా అడుగులు!?
మాళవిక మోహనన్ గురించి
మలయాళ సినిమా 'పట్టం పోలే'తో మాళవిక మోహనన్ చిత్రసీమలోకి ప్రవేశించింది. తరువాత 'బియాండ్ ది క్లౌడ్స్', విజయ్ నటించిన 'మాస్టర్' వంటి ప్రాజెక్ట్‌లతో విస్తృత గుర్తింపు పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా మలయాళ, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాలోనూ ఆవిడ ఓ హీరోయిన్. ఆ సినిమా సంక్రాంతికి రానుంది.





















