News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!

మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ తాజాగా అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించగా, అందులో ప్రభాస్ 'సలార్' మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

FOLLOW US: 
Share:

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. #Ask Malavika పేరుతో అభిమానులను తమకిష్టమైన ప్రశ్నలను అడగమని చెబితే ఓ అభిమాని 'డుంకి, 'సలార్' వీటిలో ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అడిగితే, మాళవిక ఆ అభిమానికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. కోలీవుడ్ లో దళపతి విజయ్ సరసన 'మాస్టర్' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది మాళవిక. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో ఒక్క సినిమాతోనే ప్రభాస్ కి జోడిగా నటించే అవకాశం అందుకుంది.

ప్రజెంట్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డార్లింగ్ సరసన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంతో పాటు కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' అనే భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోతకే బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ సెషన్ ని నిర్వహించింది. #Ask Malavika పేరుతో ఫ్యాన్స్ కి ఇష్టమైన ప్రశ్నలను అడగమని చెప్పింది. ఇందులో భాగంగా అభిమానులు ఏ ప్రశ్న అడిగిన దానికి చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని "డుంకి లేదా సలార్ ఇందులో ఏ మూవీ" అని అడిగితే మాళవిక ఏమాత్రం సంకోచించకుండా ప్రభాస్ పేరు చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్ ని బుట్టలో వేసుకుంది." రెండు సినిమాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. కానీ వీటిలో నేను ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం 'సలార్' సినిమానే ఎంచుకుంటాను. సలార్ టీజర్ లో ప్రభాస్ సర్, పృథ్వీరాజ్ సర్ చాలా కూల్ గా కనిపించారు అని అనుకుంటున్నాను" అంటూ తనదైన శైలిలో ఆ అభిమానికి రిప్లై ఇచ్చింది.

దీంతో మాళవిక కామెంట్స్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఆమెను సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. అలా ఒక్క మాటతో ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ తన వలలో వేసుకుందంటూ ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక  షారుక్ ఖాన్ 'డుంకి', ప్రభాస్ 'సలార్' రెండు సినిమాలు డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన షారుక్ మరోసారి 'డుంకి'తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ భావిస్తుంటే, బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ 'సలార్' తో భారీ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని డార్లింగ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ చిత్రం బాక్సాఫీస్ వద్ద పై చేయి సాధిస్తుందో చూడాలి.

Also Read : ‘మంత్‌ ఆఫ్‌ మధు’ To ‘మామా మశ్చీంద్ర’- ఈ వారం పెద్ద హిట్ కొట్టే చిన్న సినిమా ఏదో?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 04 Oct 2023 03:14 PM (IST) Tags: Malavika Mohanan Salaar Shah Rukh Khan Prabhas Dunki

ఇవి కూడా చూడండి

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

టాప్ స్టోరీస్

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి  బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !