Tollywood Stars : 2023 లో కనిపించని స్టార్ హీరోలు, వచ్చే ఏడాది మాత్రం తగ్గేదేలే!
Tollywood: 2023 లో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు వెండితెర మీద కనిపించలేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం సంక్రాంతి నుంచి క్రిస్మస్ వరకు వీరి సినిమాల సందడే కనిపించనుంది.
2023 Tollywood: ఇయర్ ఎండింగ్ కు వచ్చేశాం. ఇంకో 40 రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఒక్కసారి 2023 టాలీవుడ్ రివ్వూ చూసుకుంటే, నలుగురైదుగురు స్టార్ హీరోల సినిమాలు లేకుండానే ఈ ఏడాది గడిచిపోబోతోంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు రెండేసి సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తే, వారి సమకాలీన హీరోలైన నాగార్జున, వెంకటేష్ లు మాత్రం ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేకపోయారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండు సినిమాలను బాక్సాఫీస్ బరిలో నిలిపితే, పవన్ కల్యాణ్ ఏదొక విధంగా ఒక రీమేక్ మూవీని పూర్తి చేశారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే రవితేజ, నానీలు మాత్రం ఈ యేడాది కూడా రెండేసి చిత్రాలని తమ ఫిల్మోగ్రఫీలో పెట్టుకున్నారు.
2023 లో బిగ్ స్క్రీన్ మీద కనిపించని స్టార్ హీరోలు...
మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు మాత్రం ఈ ఏడాది వెండితెర మీద కనిపించలేదు. 2022 సమ్మర్ కు 'సర్కారు వారి పాట' అంటూ వచ్చిన మహేష్.. అప్పటి నుంచీ 'గుంటూరు కారం' ప్రాజెక్ట్ మీదనే పని చేస్తున్నారు. RRR పుణ్యమా అని తారక్ - చరణ్ లు కూడా సైలెంట్ అయిపోయారు. ఆచార్య తరువాత 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' లో తళుక్కున మెరిసిన చెర్రీ.. రెండేళ్ల నుంచి శంకర్ సినిమాతో కాలం గడుపుతున్నారు. ఎన్టీఆర్ కూడా తన పూర్తి సమయాన్ని కొరటాల శివ మూవీ షూటింగ్ కోసమో కేటాయించారు. 2021 చివర్లో 'పుష్ప' సినిమాతో వచ్చిన అల్లు అర్జున్.. ఈ రెండేళ్లలో మళ్లీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు.
పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన గుర్తింపు, నెక్స్ట్ లెవల్ సినిమాలను అందించాలనే తాపత్రయం వల్లనే టాలీవుడ్ స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ లేట్ అవుతున్నాయని అనుకోవచ్చు. 'పుష్ప: ది రైజ్' సినిమా నార్త్ లో అనూహ్య విజయం సాధించడంతో, 'పుష్ప 2' విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బన్నీ రెండేళ్లుగా సెట్స్ మీదనే ఉన్నాడు. RRR మూవీతో గ్లోబల్ వైడ్ వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడానికి చరణ్ - ఎన్టీఆర్ లు తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే 2023లో సినిమాలను అందించలేకపోయారు.
Also Read: ఎన్నికల ప్రచారంలో హీరో నాని.. ఏ పార్టీ కోసమో తెలుసా?
అభిమానులను అలరించిన హీరోలు...
ప్రభాస్ మాత్రం ఇలాంటి లెక్కలేమీ వేసుకోకుండా వరుసగా సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది జూన్ లో ఆడియెన్స్ కు 'ఆదిపురుష్' ను అందించిన డార్లింగ్.. డిసెంబర్ 22న మోస్ట్ అవైటెడ్ 'సలార్' పార్ట్-1 ను థియేటర్లలోకి తీసుకురానున్నారు. చిరు 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' సినిమాలతో వస్తే.. 'బాలయ్య వీర సింహా రెడ్డి' 'భగవంత్ కేసరి' చిత్రాలను విడుదల చేసారు. రవితేజ నటించిన 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలు ఆరు నెలల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. సమ్మర్ లో 'దసరా' అంటూ వచ్చిన నాని.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో 'హాయ్ నాన్న'తో పలకరించడానికి రెడీ అయ్యారు.
2024లో ఆ హీరోలదే హవా...
సో బాక్సాఫీస్ రిజల్ట్ ను పక్కన పెడితే 2023లో ప్రభాస్, చిరంజీవి, బాలయ్య, రవితేజ, నానీలు మాత్రమే సినీ అభిమానులను అలరించిన హీరోలని చెప్పాలి. అయితే ఈ ఏడాది వెండి తెరపై కనిపించని హీరోలంతా 2024 లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు. సంక్రాంతికి మహేష్ బాబుతో పాటుగా నాగ్ 'నా సామి రంగా', వెంకీ మామ 'సైందవ్' అంటూ వస్తున్నారు. తారక్ నటిస్తున్న 'దేవర' సినిమా మొదటి భాగం వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఆగస్టులో 'పుష్ప 2' రాబోతోంది. 'గేమ్ చేంజర్' కూడా నెక్స్ట్ ఇయర్ సెకండాఫ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఏడాది నిరుత్సాహ పరిచిన హీరోలంతా వచ్చే సంవత్సరం బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్నారు. సంక్రాంతి నుంచి క్రిస్మస్ వరకు అభిమానులను అలరించనున్నారు.
Also Read: 'లియో' యాక్టర్‌పై ఫైర్ అయిన త్రిష.. సపోర్ట్‌గా నిలిచిన లోకేష్ కనగరాజ్!