Mahesh Babu: 'రాయన్'కు మహేష్ బాబు రివ్యూ - ధనుష్ సినిమాపై సూపర్ స్టార్ ట్వీట్, ఏమన్నాడంటే?
Dhanush Raayan: ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాయన్' సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు. ట్వీట్ కూడా చేశారు. ఆ సినిమా గురించి మహేష్ ఏమన్నాడంటే?
Mahesh Babu On Raayan: కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గర అయిన ధనుష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'రాయన్'. ఆయన 50వ సినిమా అది. మరో స్పెషాలిటీ ఏమిటంటే... ఆ చిత్రానికి దర్శకుడు కూడా ధనుషే. ఈ నెల (జూలై) 28వ తేదీన అతడి బర్త్ డే. ఈ సందర్భంగా జూలై 26న 'రాయన్' సినిమా విడుదల చేశారు.
తెలుగు, తమిళ విమర్శకుల నుంచి 'రాయన్'కు మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ప్రేక్షకుల నుంచి కూడా! లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను చూశారు. ఆ తర్వాత ట్వీట్ చేశారు. మరి, మహేష్ ఏమన్నారో తెలుసా?
తప్పకుండా 'రాయన్' చూడండి - మహేష్ ట్వీట్
Mahesh Babu Tweets On Raayan: ''రాయన్' చూశా. ధనుష్ అద్భుతంగా యాక్ట్ చేయడమే కాదు... అంతే అద్భుతంగా దర్శకత్వం వహించారు. అతని నటన సూపర్. ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, మిగతా నటీనటులు అందరూ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మేస్ట్రో ఏఆర్ రెహమాన్ ఎలక్ట్రిఫయింగ్ స్కోర్ ఇచ్చారు. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. టీమ్ అందరికీ కంగ్రాట్స్'' అని మహేష్ బాబు సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్' (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
Also Read: హరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?
#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch…
— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024
Congratulations to the entire…
ధనుష్ దర్శకత్వం గురించి డిస్కషన్ అంతా!
'రాయన్' విడుదలైన తర్వాత నుంచి ధనుష్ దర్శకత్వం గురించి ఎక్కువ మంది డిస్కషన్ చేస్తున్నారు. అతడి నటన గురించి అందరికీ తెలుసు. నేషనల్ అవార్డ్ విన్నర్. కానీ, ఈ స్థాయిలో డైరెక్షన్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కథలో కొత్త అంశాలు లేకున్నా కమర్షియల్ ఫార్మటులో తీసిన విధానం చూసి విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు ఆశ్చర్యపోయారు.
Also Read: బాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్.. ఆహాలో 'అన్ స్టాపబుల్ 4 స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలుసా?
'రాయన్' సినిమాలో ధనుష్ తమ్ముళ్లుగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్... చెల్లెలి పాత్రలో దుషారా విజయన్ నటించారు. ప్రతినాయకుడి పాత్రలో ఎస్.జె. సూర్య, పోలీస్ అధికారిగా ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ సరసన 'ఆకాశం నీ హద్దురా' ఫేమ్ అపర్ణా బాలమురళి, ఎస్.జె. సూర్య భార్యలుగా వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యా పిళ్లై నటించారు. కీలక పాత్రలో ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ నటించారు.
Also Read: వచ్చే నెల నుంచి షూటింగ్స్ బంద్ - ధనుష్‌పై దండెత్తిన నిర్మాతలు, ఎందుకీ గొడవ?