SSMB29: రూపాయి రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయబోతున్న మహేష్! - అందుకేనా?
Mahesh Babu Remuneration: ఈ మూవీ కోసమే రీసెంట్‌గా మహేష్ జర్మనీ కూడా వెళ్లాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ మూవీని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
Mahesh Babu SSMB29 Remuneration: 'గుంటూరు కారంతో' హిట్ కొట్టాడు మహేష్. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. రీసెంట్‌గానే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుందని మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్‌డేట్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ మూవీపై రోజుకో అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఉగాదికి లాంచనంగా ప్రారంభం కానుందంటున్నారు. దీనిపై క్లారిటీ అయితే లేదు కానీ, 2024లోనే మూవీ రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోవడం పక్కా అంటున్నారు. ఈ మూవీ కోసమే రీసెంట్‌గా మహేష్ జర్మనీ కూడా వెళ్లాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ మూవీని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేష్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే మహేష్ పారితోషికం తీసుకోకపోవడం ఏంటని అంతా షాక్ అవుతుంది. ఇది నిజమా? కాదా? అని ఆరా తీయగా ఓ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా.. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. మహేష్ మాత్రమే కాదు జక్కన్న కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. వీరిద్దరు లాభాల్లో వాటా తీసుకుంటున్నారంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన, సమాచారం కానీ లేదు. మరి వార్తలపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి!
Also Read: హీరోయిన్‌ని పెళ్లాడిన టాలీవుడ్ విలన్ - ఫొటోలు వైరల్
కాగా మహేష్ రీసెంట్‌గా 'గుంటూరు కారం' కారంతో మంచి విజయం అందుకున్నాడు. మొదట మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మెల్లిమెల్లిగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకుంది. దీంతో రోజుకు రోజుకు ఆడియన్స్ సంఖ్య పెరగడంతో మూవీ లాభాల బాట పట్టింది. టాక్‌కు భిన్నంగా భారీ వసూళ్లు చేసి మేకర్స్‌కు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీ వరకు మహేష్ ఒక్కొక్కొ సినిమాకు రూ. 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం. ఇప్పుడు జక్కన్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు రూ. 110 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోవాలకుంటున్నారని అంటున్నారు. మరి దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ‘SSMB29’
తొలిసారి రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ‘SSMB29’ అడ్వెంచర్ మూవీగా రూపొందనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. పౌరాణిక సూపర్ హీరో హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయుడికి ఉన్న లక్షణాలు ఈ సినిమాలో మహేష్ కు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ కీలక పాత్ర పోషించేందుకు సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చిత్రం బృందం ఈ విషయంపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.