By: ABP Desam | Updated at : 26 May 2022 05:29 PM (IST)
జర్మనీలో మహేష్ బాబు ఫ్యామిలీ
Mahesh Babu's Son Gautam grade 10 results are out: సూపర్ స్టార్ మహేష్ బాబు పుత్రోత్సాహంలో ఉన్నారు. ఎందుకంటే... ఆయన కుమారుడు గౌతమ్ గ్రేడ్ 10 పూర్తి చేశారు. అదేనండీ... పదో తరగతి పూర్తి చేశారు. అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయనేది చెప్పలేదు. కానీ, కుమారుణ్ణి చూసి తాము గర్వపడుతున్నట్టు మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత పోస్టులు చేశారు.
''జర్మనీలో గౌతమ్ ఘట్టమనేని హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేస్తున్నాం. గౌతమ్ ను చూస్తే గర్వంగా ఉంది'' అని మహేష్ బాబు పేర్కొన్నారు.
''గౌతమ్ టెన్త్ గ్రేడ్ (పదో తరగతి - సీబీఎస్ఈ) రిజల్ట్స్ వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. తనకు తానుగా గౌతమ్ ఇదంతా చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా చిన్నారిని చూస్తే గర్వంగా ఉంది. ఇప్పుడు గౌతమ్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. కొత్త సవాళ్లు వేచి చూస్తున్నాయి. అయితే, గౌతమ్ అన్నిటికీ రెడీ అవుతాడు. మరింత ఎత్తుకు వెళతాడు'' అని నమ్రత పేర్కొన్నారు.
Also Read: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
'సర్కారు వారి పాట' విడుదల తర్వాత పిల్లలు గౌతమ్, సితారతో కలిసి మహేష్ బాబు, నమ్రత దంపతులు జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.
Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?
యాంకర్ మెడలో దండేసిన నటుడు, వెంటనే ఆమె ఆ దండ తీసి ఏం చేసిందో చూడండి
'పుష్ప' నిర్మాతలతో నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
అలాంటి పాత్ర కూడా చేస్తా, ఈ సినిమాకు రిఫర్ చేసింది ఆయనే: అనసూయ భరద్వాజ్
Trisha Wedding: మలయాళ నిర్మాతతో త్రిషాకు పెళ్లి - అంత మాట అనేసిందేంటీ?
డబ్బు కోసం రమ్యకృష్ణని పెళ్లి చేసుకోలేదు - సోలోగా ఉండాలనుకున్నా: కృష్ణవంశీ
ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !
/body>