అన్వేషించండి

Magadheera Re Release: థియేటర్లలోకి మళ్లీ మగధీరుడు - రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్!

Ram Charan Birthday Special: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'మగధీర' చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) సందర్భంగా అభిమానులు రక్త దానం, అన్నదానం కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేశారు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ సందడి మొదలైంది. మార్చి 27న చరణ్ పుట్టిన రోజు. ఆ సందడి థియేటర్లలో కూడా కనిపించనుంది. బర్త్ డే స్పెషల్ కింద ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయి. అందులో ముఖ్యమైన సినిమా 'మగధీర'.

మార్చి 26న తెలుగు రాష్ట్రాల్లో 'మగధీర' రీ రిలీజ్
Magadheera re release: రామ్ చరణ్ బర్త్ డే థియేటర్లలో ఒక్క రోజు ముందు మొదలు కానుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)తో ఆయన చేసిన తొలి సినిమా 'మగధీర' రీ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 26న ఈ సినిమా స్పెషల్ షోస్ వేస్తున్నారు. శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు. 

కథానాయకుడిగా రామ్ చరణ్ ప్రయాణంలో 'మగధీర'కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా హీరోగా ఆయనకు రెండోది. కానీ, స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే అలా ఉండదు. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చరణ్ అద్భుతమైన నటన కనబరిచారు. హార్స్ రైడింగ్ వంటివి చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేయడంతో ఈజీగా చేశారు. ఇక, జక్కన్న దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. మేనల్లుడి కోసం మార్కెట్ స్థాయిని మించి మరీ అల్లు అరవింద్ ఖర్చు చేశారు. గీతా ఆర్ట్స్ సంస్థపై సినిమా ప్రొడ్యూస్ చేశారు. మేనల్లుడికి మంచి విజయం అందించడంతో పాటు లాభాలు గడించారు.

Also Read: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?

'మగధీర' రీ రిలీజ్ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ... ''రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో... అత్యధిక థియేటర్లలో 'మగధీర'ను రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించడంతో పాటు మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మరోసారి థియేటర్లలో ఈ సినిమా చూసి ఘన విజయాన్ని అందించి, రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం'' అని అన్నారు.

Also Readమహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి

'మగధీర'కు ముందు మరొక సినిమా రీ రిలీజ్
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 26న 'మగధీర' రీ రిలీజ్ అవుతుంటే... ఓ రెండు  మూడు రోజుల క్రితం థియేటర్లలోకి మరో సినిమా వస్తోంది. మార్చి 23, 24 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 'నాయక్' స్పెషల్ షోలు వేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget