SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
NTR role in RRR changed: ప్రేక్షకులు చూసిన 'ఆర్ఆర్ఆర్' వేరు. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' వేరు. ఎన్టీఆర్, ఒలీవియా క్యారెక్టర్లలో మార్పులు చేశారు. ఒకవేళ ఆ వెర్షన్ రిలీజ్ చేస్తే ఎలా ఉండేదో?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' (RRR Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది. భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులు, హాలీవుడ్ సినీ ప్రముఖులకు 'ఆర్ఆర్ఆర్' ఎంతో నచ్చింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే...
ప్రేక్షకులు చూసిన సినిమా వేరు...
రాజమౌళి తీసిన ఒరిజినల్ వెర్షన్ వేరు!
ప్రేక్షకులంతా చూసిన 'ఆర్ఆర్ఆర్' వేరు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఒరిజినల్ వెర్షన్ వేరు. సినిమా అంతా పూర్తి అయ్యాక మరీ శాడ్ ఫిలింలా ఉందని ఫీలై, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ఆయనకు జోడీగా నటించిన ఫారిన్ యాక్ట్రెస్ ఒలీవియా మోరిస్ క్యారెక్టర్లలో మార్పులు చేశారట.
'ఆర్ఆర్ఆర్' ఒరిజినల్ వెర్షన్ లేదా డిలీట్ చేసిన సీన్స్ (RRR Deleted Scenes)లో జెన్నీ అలియాస్ జెన్నీఫర్ (ఒలీవియా) క్యారెక్టర్ మరణిస్తుందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం ఆయన జపాన్ (Japan)లో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ షోకి అటెండ్ అయ్యారు. షో అనంతరం ప్రేక్షకులతో ముచ్చటిస్తూ... ''మేం తొలుత జెన్నీ తన అంకుల్ గదిలోకి వెళ్లి వాళ్ల ప్లాన్స్ తెలుసుకునే సన్నివేశాలు రాశాం. అయితే, క్లైమాక్స్ దగ్గర పడుతుండటంతో అవన్నీ అవసరం లేదని ఫీల్ అయ్యాం. డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నాం. భీం (ఎన్టీఆర్)ను కలిసిన జెన్నీ, మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె బూట్లకు మట్టి ఉండటంతో ఏదో చేసిందని ఆంటీకి అనుమానం వస్తుంది. అలాగే, జైలు నుంచి రామ్ (రామ్ చరణ్)ను భీం తప్పించి... బ్రిటిషర్ల మీద ఎటాక్ చేసినప్పుడు జెన్నీకి అంకుల్ గన్ గురి పెడతారు. వాళ్ళను లొంగిపోమని చెబుతాడు. లోగిపోవడానికి ముందు షూట్ చేయడంతో జెన్నీ మరణిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ లో జెన్నీ చచ్చిపోతుంది. నేను అంత సాడ్ ఫిల్మ్ తీయాలని అనుకోలేదు'' అని చెప్పారు.
Also Read: 'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!
#RRR లో క్లైమాక్స్ లో #OliviaMorris పాత్ర చనిపోతుంది.. మేము రాసుకున్న ఒరిజినల్ వెర్షన్ లో.. #JrNTR సీన్స్ లో కూడా చాలా మార్పులు చేశాము..ఎలా అంటే?: #Rajamouli in Japan#SSMB29 #SSRajamouli #Devara pic.twitter.com/VWwe9cc1fs
— Ram (@RamGV28) March 19, 2024
'ఆర్ఆర్ఆర్' ఒరిజినల్ వెర్షన్ (RRR Original Version)లో జెన్నీఫర్ క్యారెక్టర్ మార్చడంతో ఎన్టీఆర్ క్యారెక్టర్ సన్నివేశాలు సైతం మారాయట. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయితే ఎలా ఉండేదో అని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.
జపాన్ స్పెషల్ షోలో తాను చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి కూడా రాజమౌళి డీటెయిల్స్ వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
SS RAJAMOULI confirms RRR 2 at #RRRMovie Screening in Japan 🔥✔️
— Sampath Kumar (@AlwaysSampath99) March 19, 2024
Can't Wait For it 💥🙌
Eesaari Worldwide ga 🌏🇮🇳 Jaathin dengabxxthunnam!!!! 💯💯💯#RamCharan #JrNTR #Gamechanger #Devara#GlobalStarRamCharan @IndiaToday @ssrajamouli @ssk1122 @DEADLINE #RRRMovie #NaatuNaatu pic.twitter.com/H2EBSeeONa