అన్వేషించండి

'జవాన్' మూవీపై స్పందించిన దళపతి విజయ్ - షారుఖ్ రిప్లై ఇది!

అట్లీ, షారుక్ కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' సక్సెస్ పై కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్స్ చేశారు.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(jawan) మూవీ విజయం పట్ల తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మూవీ టీం ని కంగ్రాచ్యులేట్ చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన 'జవాన్' మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. షారుఖ్, నయనతార జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. 'పఠాన్' తర్వాత షారుఖ్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది.

రీసెంట్ గానే జవాన్ రూ.1000 కోట్ల మార్క్ ని అందుకున్న విషయం తెలిసిందే. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్నిచోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీస్ సైతం జవాన్ పై ప్రశంసలు కురిపించారు. సినిమాలో డ్యూయల్ రోల్‌లో షారుక్ స్వాగ్, స్టైల్, యాక్షన్.. ఇలా అన్నిటికీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాగా ఇప్పటివరకు ఏ సినిమా గురించి మాట్లాడని ఓ స్టార్ హీరో జవాన్ పై మొదటిసారి ప్రశంసలు కురిపించాడు. ఆయన మరెవరో కాదు దళపతి విజయ్.

సోషల్ మీడియాలో ఏమాత్రం యాక్టివ్ గా ఉండని విజయ్ ఇప్పటివరకు ఓ సినిమా గురించి కానీ ఓ హీరో గురించి కానీ ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా చెప్పడం జరగలేదు. కానీ మొట్టమొదటిసారి 'జవాన్' సినిమాపై స్పందిస్తూ పలు ఆసక్తికర ట్వీట్స్ చేశారు. జవాన్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ట్విట్టర్లో సినిమా చూసి ప్రశంశలు కురిపిస్తున్న వారందరికీ షారుక్ ఓపిగ్గా సమాధానం ఇస్తూ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా దళపతి విజయ్ ఫ్యాన్స్ 'జవాన్' సినిమా రూ.1000 కోట్లు సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు. దీనికి షారుక్ రిప్లై ఇస్తూ.. "మీ విషెస్ కు థాంక్యూ. దళపతి తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐ లవ్ విజయ్ సర్" అంటూ రాస్కొచ్చాడు.

ఇక ఈ ట్వీట్ కి స్వయంగా దళపతి విజయ్ రిప్లై ఇస్తూ.. "బ్లాక్ బస్టర్ సాధించినందుకు అభినందనలు. అట్లీ, షారుక్ సార్ మరియు చిత్ర బృందానికి.. లవ్ యు టూ షారుక్ సార్" అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసి షారుఖ్ ఖాన్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో విజయ్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దళపతి విజయ్ ప్రస్తుతం 'లియో' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక షారుఖ్ ఖాన్ విషయానికొస్తే, 'జవాన్' సక్సెస్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' అనే సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ‘యానిమల్’ టీజర్: నాకన్నా చెడ్డవాడు లేడు - రణ్ బీర్ ఊరమాస్ అవతార్ అదుర్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Embed widget